Top 5 Mid Cap Mutual Funds: పెట్టుబడికి ఉత్తమ ఎంపిక ఈ టాప్ 5 మిడ్ క్యాప్ ఫండ్స్‌.. లాభాలు చూస్తే షాకవుతారంతే?

మ్యూచువల్ ఫండ్‌ల మిడ్ క్యాప్ ఫండ్‌లు కొత్త ఏడాదిలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసే వారికి ఉత్తమ ఎంపికగా నిలిచింది.

Top 5 Mid Cap Mutual Funds: పెట్టుబడికి ఉత్తమ ఎంపిక ఈ టాప్ 5 మిడ్ క్యాప్ ఫండ్స్‌.. లాభాలు చూస్తే షాకవుతారంతే?
Top 5 Mid Cap Mutual Funds
Follow us
Venkata Chari

|

Updated on: Dec 17, 2021 | 6:48 PM

Top 5 Mid Cap Mutual Funds: కొత్త సంవత్సరం 2022 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు మీ భవిష్యత్తు కోసం ఎలాంటి ఆర్థిక ప్రణాళికలు చేయకపోతే, మీకు కొత్త సంవత్సరం కంటే మంచి సమయం మరొకటి ఉండదు. కొత్త సంవత్సరంలో, మార్కెట్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు మీ కోసం ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవచ్చు. స్టాక్ మార్కెట్ కొత్త శిఖరాలను తాకుతాయనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. మార్కెట్ పడిపోతున్నప్పటికీ, దేశీయ ఫండ్స్ తమ పెట్టుబడులను నిరంతరం పెంచుతూనే ఉన్నాయి. అందువల్ల, మార్కెట్లో పెద్దగా కరెక్షన్ ఉండబోదు. అటువంటి పరిస్థితిలో పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడిపై అద్భుతమైన రాబడిని ఆశించవచ్చు. ఐదు అత్యుత్తమ మిడ్ క్యాప్ ఫండ్‌లను మీ ముందుకు తీసుకోచ్చాం. ఇవి ఇప్పటివరకు బాగా పని చేశాయి. అలాగే భవిష్యత్తులో కూడా మంచి రాబడిని ఇస్తాయని భావిస్తున్నారు. మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ఈ ఫండ్లలో పెట్టుబడి పెట్టి, మీ భవిష్యత్తును నిర్మించుకోవచ్చు.

1. PGIM ఇండియా మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ డైరెక్ట్-గ్రోత్: PGIM ఇండియా మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ డైరెక్ట్-గ్రోత్ ఉత్తమ మిడ్ క్యాప్ ఫండ్లలో ఒకటి. గత మూడేళ్లలో, ఈ ఫండ్ పెట్టుబడిదారులకు సగటున 37.37 శాతం కంటే ఎక్కువ వార్షిక రాబడిని అందించింది. 2013లో ఫండ్ ప్రారంభించినప్పటి నుంచి ఇది సగటున 21.48 శాతం రాబడిని అందించింది.

PGIM ఇండియా మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ డైరెక్ట్-గ్రోత్ ఒక సంవత్సరంలో 68.84 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ 3 సంవత్సరాలలో 37.37 శాతం రాబడిని ఆర్జించింది. అలాగే 5 సంవత్సరాలలో, ఈ ఫండ్ పెట్టుబడిదారులకు 24.94 శాతం రాబడిని అందించింది. డిసెంబర్ 16 నాటికి దీని ఎన్‌ఏవీ (నికర ఆస్తి విలువ) యూనిట్‌కు రూ. 47.85గా నిలిచింది.

2. మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ 30 ఫండ్ – డైరెక్ట్ ప్లాన్: మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ 30 ఫండ్ – డైరెక్ట్ ప్లాన్ కూడా అత్యుత్తమ మిడ్ క్యాప్ ఫండ్‌లలో ఒకటిగా పేరుగాంచింది. ఫండ్ ప్రారంభించినప్పటి నుంచి ఇది సగటు వార్షిక రాబడి 22.77 శాతంగా ఉంది.

మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ 30 ఫండ్ – డైరెక్ట్ ప్లాన్ ఒక సంవత్సరంలో 58.84 శాతం రాబడిని ఆర్జించింది. ఈ ఫండ్ 3 సంవత్సరాలలో 24.85 శాతం, 5 సంవత్సరాలలో 17.30 శాతం రాబడిని ఇచ్చింది. డిసెంబర్ 16 నాటికి దీని ఎన్‌ఏవీ (నికర ఆస్తి విలువ) యూనిట్‌కు రూ. 49.68గా నిలిచింది.

3. క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ – డైరెక్ట్ ప్లాన్: క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ – డైరెక్ట్ ప్లాన్ కూడా టాప్ మిడ్ క్యాప్ ఫండ్లలో రాణిస్తోంది. ఫండ్ ప్రారంభమైనప్పటి నుంచి సగటున 17.26 శాతం రాబడిని అందించింది.

క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ – డైరెక్ట్ ప్లాన్ ఒక సంవత్సరంలో 61.79 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ 3 సంవత్సరాలలో 30.77 శాతం రాబడిని అందించింది. 5 సంవత్సరాలలో, ఫండ్ పెట్టుబడిదారులకు 23.23 శాతం రాబడిని ఆర్జించి పెట్టింది. డిసెంబర్ 16 నాటికి దీని ఎన్‌ఏవీ (నికర ఆస్తి విలువ) యూనిట్‌కు రూ. 127.20గా నిలిచింది.

4. యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్ – డైరెక్ట్ ప్లాన్: యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్ – డైరెక్ట్ ప్లాన్ కూడా టాప్ మిడ్ క్యాప్ ఫండ్లలో పేరుగాంచింది. ఈ ఫండ్ ప్రారంభం నుంచి దాదాపు 21.33 శాతం రాబడిని అందించింది.

యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్ – డైరెక్ట్ ప్లాన్ ఒక సంవత్సరంలో 43.84 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ 3 సంవత్సరాలలో 27.60 శాతం రాబడిని ఆర్జించి పెట్టింది. 5 సంవత్సరాలలో ఈ ఫండ్ పెట్టుబడిదారులకు 24.89 శాతం రాబడిని అందించింది. డిసెంబర్ 16 నాటికి దీని ఎన్‌ఏవీ (నికర ఆస్తి విలువ) యూనిట్‌కు రూ. 77.83గా నిలిచింది.

5. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ – డైరెక్ట్ ప్లాన్: నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ – డైరెక్ట్ ప్లాన్ కూడా ఇటీవలి సంవత్సరాలలో పెట్టుబడిదారులకు గొప్ప లాభాలను అదించింది. ఫండ్ ఒక సంవత్సరంలో దాదాపు 76.55 శాతం రాబడిని ఆర్జించి పెట్టింది. ఈ ఫండ్ ప్రారంభించినప్పటి నుంచి సగటున 17.73 శాతం రాబడిని అందిచింది.

నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ – డైరెక్ట్ ప్లాన్ ఒక సంవత్సరంలో 48.83 శాతం రాబడిని అందించింది. ఈ ఫండ్ 3 సంవత్సరాలలో 25.57 శాతం రాబడిని అందించింది. 5 సంవత్సరాలలో ఫండ్ పెట్టుబడిదారులకు 20.37 శాతం రాబడిని అందించింది. డిసెంబర్ 16 నాటికి దీని ఎన్‌ఏవీ (నికర ఆస్తి విలువ) యూనిట్‌కు రూ. 2188గా నిలిచింది.

Also Read: Rakesh Jhunjhunwala: 10 సెకెన్లలో రూ. 318 కోట్లు మాయం.. దలాల్ స్ట్రీట్‌లో దగాపడిన బిగ్ బుల్..

కాలం మారింది.. పొదుపు పథకాలలో బదులు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌.. ఎందుకంటే..?

డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!