AP Liquor: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు

AP Liquor: మందుబాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఏపీలో మద్యం ధరలను తగ్గిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం..

AP Liquor: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు
Follow us
Subhash Goud

|

Updated on: Dec 18, 2021 | 7:05 PM

AP Liquor: మందుబాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఏపీలో మద్యం ధరలను తగ్గిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం మద్యం ధరలలో మార్పులు చేయడంతో మద్యం బాబులకు పండగే. వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీ మార్జిన్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇండియన్‌ మేడ్‌ఫారిన్‌ లిక్కర్‌పై 5 నుంచి 12 శాతం తగ్గించింది. అన్ని కేటగిరిల మద్యంపై 20 శాతం వరకు ధరలను తగ్గించనుంది ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం, నాటుసారా తయారీని అరికట్టేందుకు ధర తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మద్యం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ప్రయాణికుడు ముఖానికి మాస్క్‌కు బదులు ఏం ధరించాడో చూడండి.. అతనిపై కోపంతో రగిలిపోయి విమానం దింపేసిన అధికారులు

Delhi Schools: పాఠశాలలపై ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం