Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: ముఖ్యమంత్రి అభయంతో ఉత్కంఠకు తెర.. రాజీనామా చేసిన కీలక నేత..!

AP Politics: కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి సంబంధించి వారం రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.

AP Politics: ముఖ్యమంత్రి అభయంతో ఉత్కంఠకు తెర.. రాజీనామా చేసిన కీలక నేత..!
Kurnool Zp
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 18, 2021 | 7:29 PM

AP Politics: కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి సంబంధించి వారం రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఏకంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడంతో.. ఈ వివాదం సమసింది. రాజకీయ భవిష్యత్తుకు ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇవ్వడంతో ఎట్టకేలకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి వెంకట సుబ్బారెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని వైసీపీ సీనియర్ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి కి ఇవ్వాలని మొదట అధిష్టానం భావించింది. కొలిమిగుండ్ల జడ్పీటీసీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటరెడ్డి దురదృష్టవశాత్తు కరోనాతో మృతిచెందారు. దాంతో సంజామల జడ్పీటీసీ వెంకటసుబ్బారెడ్డి ని అనుకోని విధంగా చైర్మన్ పదవి వరించింది. అయితే, ఎర్రబోతుల కుటుంబంలో ఎవరైనా జడ్పీటీసీగా గెలిస్తే వెంకటసుబ్బారెడ్డి రాజీనామా చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే కొలిమిగుండ్ల జడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికలలో ఎర్రబోతుల వెంకటరెడ్డి కొడుకు పాపిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో పాపిరెడ్డి చైర్మన్ అవ్వాలని పార్టీ ఆదేశించింది. ఈ క్రమంలోనే వెంకట సుబ్బారెడ్డిని రాజీనామా చేయాలంటూ గత వారం రోజులుగా ఒత్తిడి తీసుకువచ్చింది పార్టీ.

అయితే, తన రాజకీయ భవిష్యత్తు ఏంటి అని వెంకటసుబ్బారెడ్డి అడగటం, రాజీనామా చేసేందుకు విముఖత వ్యక్తం చేయడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. చివరికి ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదని జగన్ హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఈ రోజు వెంకటసుబ్బారెడ్డి తన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కలెక్టర్ కోటేశ్వరరావు కు అందించారు. దీంతో ఎర్రబోతుల పాపిరెడ్డి కి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి పాపిరెడ్డి ని చైర్మన్‌గా ఎన్నుకోవాలని నిర్ణయించింది పార్టీ. రాజీనామా అనంతరం వెంకటసుబ్బారెడ్డి, పాపిరెడ్డి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.

Also read:

Delhi News: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఆటోరిక్షాపై బోల్తాపడిన కంటైనర్.. నలుగురు మృతి, పరారీలో డ్రైవర్

Assembly Elections 2022: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. జనవరిలో షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్!

MLA RK Roja Comments: రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు