Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఇక ఆ పాము కనిపించదు.. శోకసంద్రంలో భక్తులు..!
Vijayawada: ఇంద్రకీలాద్రిపై గత కొన్నేళ్లుగా సంచరిస్తున్న రెండు పాములలో ఒక పాము ప్రాణాలు కోల్పోయింది.

Vijayawada: ఇంద్రకీలాద్రిపై గత కొన్నేళ్లుగా సంచరిస్తున్న రెండు పాములలో ఒక పాము ప్రాణాలు కోల్పోయింది. అది గుర్తించిన దుర్గ గుడి అధికారులు విజయవాడ దుర్గా ఘాట్‌లో పాముకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు దుర్గాఘాట్‌లో పాముకు దహన సంస్కారాలు చేశారు. మనుషులకు ఏ విధంగా అయితే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారో.. అలాగే పాముకు కూడా చేశారు. అయితే, ఈ పాముకు కొంత చరిత్ర ఉంది. భక్తుల నుంచి విశేష పూజలు అందుకున్న చరిత్ర దీనిది. ఇంద్రకీలాద్రిపై గత కొన్నేళ్లుగా రెండు పాములు సంచరిస్తున్నాయి. ఇటీవల అంతరాలయంలో పాము కనిపించి మాయమైంది.
అయితే, కొండపైన సంచరిస్తున్న ఈ రెండు పాములను అర్చకులు, భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తూ వచ్చారు. ఇలా కొన్నేళ్లుగా ఆలయ అర్చకులకు, భక్తులకు దర్శనమిస్తూ వచ్చాయి. అయితే, శుక్రవారం నాడు సాయంత్రం ఓం టర్నింగ్ వద్ద ఈ రెండింటిలో ఒక పాము చనిపోయింది. అది గమనించిన ఆలయ అధికారులు, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు పాముకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రాంతాల్లో సర్పాలు చనిపోతే మనుషుల మాదిరిగానే వాటికి కార్యక్రమాలు చేయాలని దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చనిపోయిన పాముకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించామన్నారు.
Delhi News: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఆటోరిక్షాపై బోల్తాపడిన కంటైనర్.. నలుగురు మృతి, పరారీలో డ్రైవర్
MLA RK Roja Comments: రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు