- Telugu News Photo Gallery Spiritual photos Keep these things in mind while keeping fish aquarium at home otherwise your luck may get upset Astro tips in telugu
Fish Aquarium: ఇంట్లో ఫిష్ అక్వేరియం ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా.. లేదంటే కలతలు మీ చెంతే..
Fish Aquarium: ఇంట్లో అందం ఆహ్లాదం కోసం అక్వేరియాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అక్వేరియంలో అందమైన చేపలు ఈత కొట్టడం చూస్తే చాలా రిలాక్స్‌గా ఉంటుంది. కానీ వాటిని ఇంట్లో ఉంచే ముందు, కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా మీ అదృష్టం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. జీవితంలో పురోగతిని సాధిస్తారు.
Updated on: Dec 18, 2021 | 10:30 AM

వంటగదిలో లేదా పడకగదిలో లేదా ఇంటి మధ్యలో చేపల అక్వేరియం ఉంచవద్దు. చేపల అక్వేరియంను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచండి. తద్వారా సహజ కాంతి అక్వేరియంపై ప్రసరిస్తుంది. దీంతో కెరీర్‌లో మంచి ఎదుగుదల, ఇంట్లో సంతోషం నెలకొంటుంది.

అక్వేరియంలో చేపల సంఖ్య కనీసం తొమ్మిది ఉండాలి. మీరు పెంచే చేపలు సహజ మరణానికి గురైతే.. అవి మీ ఇంటి సమస్యలను తమతో పాటు తీసుకువెళ్తున్నాయని నమ్మకం.

ఒక చేప చనిపోతే, వెంటనే దానిని అక్వేరియం నుండి తీసివేసి, కొత్త చేపలను ఫిష్ ట్యాంక్‌లో వేయాలి. తద్వారా ట్యాంక్‌లో చేపల సంఖ్య తగ్గదు. ట్యాంక్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. నీటి కాలుష్యం లేకుండా చూసుకోవాలి.. యాంటీ-క్లోరిన్ వైట్ ట్యాబ్లెట్లను నీటిలో వేసుకోవాలి.

చేపల్లో నల్ల చేప, బంగారు చేప, ఎర్ర చేప ఉండాలి. ఇవి ఇంటి ఆనందంతో ముడిపడి ఉన్నవిగా నమ్మకం. ఇవి చెడు దృష్టి నుంచి ఇంటిని దూరంగా ఉంచుతాయి. ఫిష్ అక్వేరియం లోపల నీరు ప్రవహించే శబ్దం ఇంట్లో సానుకూలతకు నిదర్శనం.





























