AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఒమిక్రాన్ కలకలం.. 11 రాష్ట్రాకు పాకిన వైరస్.. ఇవాళ కొత్త కరోనా కేసులు ఎన్నంటే?

Covid 19 Cases today update: దక్షిణాఫ్రికాలో మొదలైన కరోనా వైరస్ కొత్త వేరియంట్​మరోసాని ప్రపంచ వ్యాప్తంగా కుదుపేస్తోంది. ఒమిక్రాన్ (Omicron variant) రూపాంతరం చెందిన కరోనా వైరస్ పలు దేశాల్లో కలవరపెడుతోంది.

Omicron: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఒమిక్రాన్ కలకలం.. 11 రాష్ట్రాకు పాకిన వైరస్.. ఇవాళ కొత్త కరోనా కేసులు ఎన్నంటే?
Corona
Balaraju Goud
|

Updated on: Dec 18, 2021 | 10:36 AM

Share

India Omicron Cases: దక్షిణాఫ్రికాలో మొదలైన కరోనా వైరస్ కొత్త వేరియంట్​మరోసాని ప్రపంచ వ్యాప్తంగా కుదుపేస్తోంది. ఒమిక్రాన్ (Omicron variant) రూపాంతరం చెందిన కరోనా వైరస్ పలు దేశాల్లో కలవరపెడుతోంది. ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్.. ఇప్పటికే ఆ దేశాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటివకే పలు దేశాల్లో చాపకింద నీరులా విరుచుకుపడుతోంది.గతంలో వచ్చిన అన్ని కరోనా వైరస్​ల కంటే సెకండ్​ వేవ్​లో భారత్​లో అల్లకల్లోలం సృష్టించిన డెల్టా రకం (delta variant) అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా విజృంభిస్తున్న ఒమిక్రాన్​ వేరియంట్.. డెల్టా కంటే 70 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే భారత్​లో ఒమిక్రాన్ (Omicron)​ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక, భారత్​లోనూ ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కేసులు ఇప్పటికే 111కి చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

అయితే, ఈ ఒమిక్రాన్ వేరియంట్ 11 రాష్ట్రాలకు విస్తరించిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32, ఢిల్లీలో 22 కేసులు బయటపడినట్లు తెలిపింది. ఈ తర్వాత రాజస్తాన్‌లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8 గుజరాత్‌లో 5 కేరళలో 5 కేసులు వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, బెంగాల్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదూనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కోవిడ్ పరిస్థుతలపై కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. గతంలో బయటపడిన డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారి కోవిడ్ కేసుల్లో 2.4 శాతం ఈ వేరియంట్ కేసులేనని తెలిపారు

ఈ కొత్త రకం వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. ఈ దేశాలు క‌రోనా వైర‌స్ వ్యాప్తిపై నిఘా పెంచాలని, వ్యాప్తి అడ్డుకొట్ట‌కు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు చేప‌డితే మంచిద‌ని ఆగ్నేయాసియా ప్రాంత డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ సూచించారు. అయితే, ఈ ఒమిక్రాన్​ వేరియంట్​ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో ఇవాళ కరోనా కేసులు..

ఇదిలావుంటే, ఇవాళ దేశంలో 7,145 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 289 మంది రోగులు మరణించారు. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 84 వేలకు తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,706 మంది ఇన్‌ఫెక్షన్ నుండి కోలుకున్నారని, ఆ తర్వాత ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,41,71,471కి పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశంలో ఇప్పటివరకు 4,77,158 మంది ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారు. భారతదేశంలో కరోనావైరస్ కోసం శుక్రవారం 12,45,402 నమూనా పరీక్షలు జరిగాయని, ఆ తర్వాత దేశంలో నమూనా పరీక్ష సంఖ్య 66,28,97,388కి పెరిగిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. భారతదేశంలో ప్రస్తుతం 84,565 మంది కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న యాక్టివ్ పేషెంట్లు, ఇది మొత్తం కేసులలో 0.24 శాతం. యాక్టివ్ కేసుల సంఖ్య మార్చి 2020 తర్వాత అత్యల్పంగా ఉంది.

Read Also.. Crime News: పిల్లలకు బిర్యానీ తీసుకెళ్లేందుకు వచ్చిన వ్యక్తిపై రెస్టాంట్ నిర్వహకులు దాడి.. భార్య ఫిర్యాదుతో సంచలనాలు!