AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: పిల్లలకు బిర్యానీ తీసుకెళ్లేందుకు వచ్చిన వ్యక్తిపై రెస్టాంట్ నిర్వహకులు దాడి.. భార్య ఫిర్యాదుతో సంచలనాలు!

ఇంట్లో ఉన్న తన పిల్లలకు ఆహారం కొనుక్కోవాలని చూస్తున్న వలస కూలీని దొంగగా భావించిన బిర్యానీ రెస్టారెంట్‌ నిర్వహకులు తీవ్రంగా కొట్టారు. ఆ మరుసటి రోజు ఆ వ్యక్తి మృతి చెందాడు.

Crime News: పిల్లలకు బిర్యానీ తీసుకెళ్లేందుకు వచ్చిన వ్యక్తిపై రెస్టాంట్ నిర్వహకులు దాడి.. భార్య ఫిర్యాదుతో సంచలనాలు!
Balaraju Goud
|

Updated on: Dec 18, 2021 | 10:17 AM

Share

Hyderabad Man Murdered: ఇంట్లో ఉన్న తన పిల్లలకు ఆహారం కొనుక్కోవాలని చూస్తున్న వలస కూలీని దొంగగా భావించిన బిర్యానీ రెస్టారెంట్‌ నిర్వహకులు తీవ్రంగా కొట్టారు. ఆ మరుసటి రోజు ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ దారుణమైన ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని ఇజ్జత్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన రాజేష్ (32) బాచుపల్లిలోని ఓ స్థలంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి, రాజేష్ పని నుండి తిరిగి వస్తున్నాడు. ఇంటికి ఆహారం తీసుకోవడానికి తినుబండారాల కోసం వెతుకుతున్నాడు. అతను JNTU మెట్రో స్టేషన్ సమీపంలో ఒక రెస్టారెంట్ తెరిచి ఉంది. అతను రెస్టారెంట్ సెల్లారులో సెలబ్రేషన్ శబ్దాలు వినిపించడంతో అక్కడికి వెళ్లాడు. అక్కడ అతను సంబరాలు చేసుకుంటున్న గుంపును చూశాడు. వారంతా రెస్టారెంట్ నిర్వాహకుడి పుట్టినరోజును జరుపుకుంటున్నారని, వారంతా మద్యం పార్టీ చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

వాళ్ళను చూసిన రాజేష్, మిగిలిపోయిన ఆహారం ఇవ్వాలని అడిగాడు. అయితే, అర్థరాత్రి సమయంలో అక్కడికి వచ్చిన వ్యక్తిని, దొంగగా భావించి అసభ్యంగా ప్రవర్తించి కొట్టడం మొదలుపెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ పార్టీ చేసుకున్నవారంతా ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. అతన్ని సెల్లార్‌లోనే అపస్మారక స్థితిలో ఉంచారు.

గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రెస్టారెంట్ నిర్వహకులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి వివరాల కోసం ఆరా తీశారు. అతని జేబులో దొరికిన వివరాల ఆధారంగా అతని భార్య సత్యభామకు ఫోన్ చేసారు పోలీసులు. సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు అతనిని వారి ఇంటికి తీసుకెళ్లారు. అయితే, పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. దీంతో సత్యభామ తొలుత మాదాపూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అయితే, జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన పోలీసులు.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. అనంతరం పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read Also…  Women Marriage Age: మహిళల చట్టబద్ధమైన వివాహ వయస్సు పెంపుపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల వివాదాస్పద వ్యాఖ్యలు!