Crime News: కరోనా సోకిన బాలికను వైద్యం చేయిస్తానని తీసుకెళ్లిన మాయలేడీ.. ఆరు నెలలుగా బలవంతంగా వ్యభిచారం!

అనారోగ్యం పాలైన బాలికకు మెరుగైన వైద్యం చేయిస్తానని తీసుకెళ్లిన ఓ మాయలేడీ రొంపిలోకి దింపింది. కుటుంబ పరిస్థితులను ఆసరా చేసుకుని మాయలోకానికి తీసుకెళ్లింది.

Crime News: కరోనా సోకిన బాలికను వైద్యం చేయిస్తానని తీసుకెళ్లిన మాయలేడీ.. ఆరు నెలలుగా బలవంతంగా వ్యభిచారం!
Crime
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 18, 2021 | 8:40 AM

Guntur Girl forced prostitution: అనారోగ్యం పాలైన బాలికకు మెరుగైన వైద్యం చేయిస్తానని తీసుకెళ్లిన ఓ మాయలేడీ రొంపిలోకి దింపింది. కుటుంబ పరిస్థితులను ఆసరా చేసుకుని మాయలోకానికి తీసుకెళ్లింది. భయభ్రాంతులకు గురిచేసి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం చేయించింది. బాలిక మరోసారి అనారోగ్యానికి గురై, ఇంటికి చేరడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఎట్టకేలకు తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

గుంటూరులో ఓ ఫ్యాక్టరీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి భార్య, అతని కూతురుకి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో వారిద్దరిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించగా భార్య చికిత్స పొందుతూ ఈ ఏడాది జూన్‌లో ప్రాణాలు విడిచింది. ఆ కుటుంబానికి వెనుక ముందు ఎవరు లేరన్న విషయం గుంటూరు స్వర్ణభారతినగర్‌కు చెందిన ఓ మహిళ తెలుసుకుంది. తాను ఆసుపత్రిలో నర్సునని ఆ బాలిక తండ్రిని నమ్మించింది. నాటు వైద్యం చేయిస్తానని బాలికను ఇంటికి తీసుకెళ్లింది. అనంతరం బాలికను పెట్టుబడిగా వ్యాపారం మొదలు పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తిప్పుతూ.. వ్యభిచారం చేయించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ మైనర్ బాలిక మరోసారి అనారోగ్యం పాలవడంతో ఆ మాయలేడీ నడిరోడ్డుపై వదిలేసింది. దీంతో రెండురోజుల క్రితం ఇంటికి చేరుకున్న బాలిక.. జరిగిన దారుణం గురించి తండ్రికి చెప్పింది. తండ్రి ఫిర్యాదు మేరకు గుంటూరు అర్బన్‌ జిల్లా పోలీసులు మేడికొండూరు స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకుని అరండల్‌పేట స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితురాలు నర్సుగా నమ్మబలికిన వ్యభిచారం నిర్వాహకురాలుగా పోలీసులు గుర్తించారు.

గుంటూరు అర్బన్ జిల్లా పోలీసుల కథనం ప్రకారం… పల్నాడులో 13ఏళ్ల బాలిక ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. కరోనా బారిన పడ్డ బాలిక, ఆమె తల్లి గుంటూరు జనరల్ ఆసుపత్రిలో చేరగా స్వర్ణభారతినగర్‌కు చెందిన ఓ మహిళ నమ్మించి తన వెంట ఇంటికి తీసుకెళ్లింది. కొద్ది రోజులకే వ్యభిచారం చేయాలని బాలికపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చింది. ఆ పనిచేయడం ఇష్టం లేదని చెప్పిన బాలికను ఇంట్లో బంధించి బయటకు రానీయకుండా శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసింది. కొన్నాళ్లు గుంటూరులో ఆ తర్వాత ఒంగోలు, నెల్లూరు, విజయవాడకు సైతం తీసుకెళ్లి వ్యభిచారం చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

గత కొద్దిరోజుల నుంచి అనారోగ్యం పాలవడంతో వ్యభిచార నిర్వాహకురాలు ఆ బాలికను విజయవాడలో వదిలేయడంతో రెండు రోజుల క్రితం ఇంటికి చేరిందని అనుమానిస్తున్నారు. ఇదిలావుంటే ఆ బాలిక తప్పిపోయినట్లు ఆమె తండ్రి సుమారు రెండు నెలల క్రితం నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బాలిక నెల్లూరులో ఉందని తెలియటంతో నల్లపాడు పోలీసులు కేసును క్లోజ్‌ చేశారు. రెండు నెలల క్రితం ఆ బాలిక నెల్లూరులో ఉందని తెలిస్తే అదుపులోకి తీసుకోకుండా ఇన్నాళ్ల పాటు దీన్ని గోప్యంగా ఉంచడం ఏమిటి? ఇప్పటి దాకా ఆ బాలిక ఎవరి చెరలో ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఆ బాలికను తండ్రే అప్పగించారా? దీని వెనుక ఏమైనా బేరసారాలు జరిగాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై1 గుంటూరు సౌత్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతిని వివరణ కోరగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితులు వ్యభిచారం చేయిస్తారని ధ్రువీకరించుకున్నామన్నారు. అయితే, వారు ప్రస్తుతం ఫోన్లు స్విచాఫ్‌ చేసి ఉంచారని, ఆ బాలిక కోలుకున్నాక పూర్తిస్థాయిలో విచారిస్తామని తెలిపారు. ప్రస్తుతం బాలిక నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకుని వైద్య పరీక్షలకు పంపినట్లు డీఎస్పీ చెప్పారు.

Read Also…  Viral: గర్ల్‌ఫ్రెండ్ అలిగింది.. ఆమెకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చేందుకు చోరీ.. కానీ చివరకు