Viral: గర్ల్‌ఫ్రెండ్ అలిగింది.. ఆమెకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చేందుకు చోరీ.. కానీ చివరకు

నైరుతి ఢిల్లీలోని సరోజినీ నగర్ ప్రాంతంలో పిస్టల్‌తో బెదిరించి ఓ వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Viral: గర్ల్‌ఫ్రెండ్ అలిగింది.. ఆమెకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చేందుకు చోరీ.. కానీ చివరకు
Robbery
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 18, 2021 | 8:47 AM

నైరుతి ఢిల్లీలోని సరోజినీ నగర్ ప్రాంతంలో పిస్టల్‌తో బెదిరించి ఓ వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో జైలు జీవితం గడిపిన ఒక వ్యక్తి ప్రేయసి అలక వహించడంతో.. ఆమెకు ఖరీదైన కానుకలు ఇచ్చి ప్రసన్నం చేసుకునేందుకు ఈ దోపిడీకి ప్లాన్ చేశాడు. నిందితులను ఆర్‌కె పురం నివాసి శుభం (20), నిజాముద్దీన్‌లో నివాసం ఉంటున్న ఆసిఫ్ (19), జామియా నగర్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ముల్లా (41)గా గుర్తించారు. నేరస్తులను గుర్తించేందుకు స్పెషల్ టీమ్ నిఘా ఫుటేజీని సేకరించేందుకు ప్రయత్నించిందని, అయితే పరిసరాల్లో కెమెరాలు లేవని పోలీసులు తెలిపారు.

ఒక దొంగ.. మరొకరిని ‘శుభం’ అని పిలిచారని బాధితుడు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులకు క్లూ దొరికింది. ‘శుభం’ అనే పేరుతో ఉన్న 150 మంది పాత నేరస్థల చిట్టాలను విప్పారు. దీంతో పోలీసులకు నిందితులను గుర్తించడం సులభమైంది. శుక్రవారం, సరోజినీ నగర్ ప్రాంతంలో దోపిడీకి గురైన స్కూటర్‌ను నడుపుతున్న శుభంతో పాటు అతని ఇద్దరు సహచరులను పోలీసులు పట్టుకున్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ శర్మ తెలిపారు.

జైల్లో పరిచయం…. 

జులైలో సరోజినీ నగర్ ప్రాంతంలో మొబైల్ ఫోన్లు లాక్కున్న కేసులో అరెస్టయ్యానని, నవంబర్‌లో విడుదలైనట్లు విచారణలో శుభం  వెల్లడించాడు. జైలులో ఉన్నప్పుడు ఆసిఫ్‌ ఫ్రెండ్ అయ్యాడని.. బయటకు రాగానే మళ్లీ కలిశాడని పోలీసులకు వివరించాడు. తామంతా కలిసి దోపిడికి ప్లాన్ చేసుకున్నట్లు పేర్కొన్నాడు. కాగా ‘శుభం’ గతంలో రెండు కేసుల్లో, ఆసిఫ్ మూడు కేసుల్లో, ముల్లా మూడు కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు స్కూటర్లు, ఒక ల్యాప్‌టాప్, చోరీకి గురైన నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక బ్యాగ్‌తో పాటు బట్టలు, షూలు, ఒక చేతి గడియారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.

Also Read:  పిల్లలు కలగలేదని ఇల్లాలికి బొడ్డుతాడు తినిపించారు..పాపం చివరికి

వివాహేతర సంబంధం బయటపెడతానని భయపెట్టి వివాహితపై బాలుడు అత్యాచారం

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..