Health Tips: ఆహారం తిన్న తరువాత ఈ రెండు పనులు చేస్తే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం.. అవేంటంటే..!
Health Tips: ఫుడ్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. నచ్చిన ఆహారం కళ్ల ముందు కనిపిస్తే.. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా
Health Tips: ఫుడ్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. నచ్చిన ఆహారం కళ్ల ముందు కనిపిస్తే.. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కుమ్మేస్తుంటాం. కొందరు ఆహార ప్రియులు అయితే అదీ ఇదీ అనే తేడా లేకుండా అన్నీ కుమ్మేస్తుంటారు. అయితే, తినగానే సరిపోదు.. ఆ తరువాతే అసలు కథ ఉంటుంది. తిన్న ఫుడ్ సరిగా జీర్ణం అయితేనే వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే.. అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుంది. జీర్ణక్రియ సరిగా జరుగకపోతే.. అనేక రకాల వ్యాధులు వస్తుంటాయి. మలబద్ధకం, చర్మ సమస్యలు, రక్తహీనత వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే, ప్రస్తుత కాలంలో మార్కెట్‌లో జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించే ఔషధాలు మార్కెట్‌లో విపరీతంగా ఉన్నాయి. అలా అని ఔషధాలపై ఎక్కువ ఆధారపడినా అంతే సంగతి. అందుకే భారతీయ వైద్య శాస్త్రంలో, ఆయుర్వేదంలో జీర్ణ ప్రక్రియ మెరుగ్గా సాగేందుకు అనేక ఉపాయాలు, సలహాలు, చిట్కాలు పేర్కొనడం జరిగింది. వాటిని మన దినచర్యలో భాగంగా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవడం ఖాయం అని నిపుణులు చెబుతున్నారు. మరి జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడానికి ఆయుర్వేదంలో పేర్కొన్న చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం తర్వాత వజ్రాసనం.. మధ్యాహ్న భోజనం తర్వాత వజ్రాసనం చేయడం చాలా ప్రయోజనకరం. వజ్రాసనంలో కూర్చోవడం వల్ల మీ పొత్తికడుపులో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ, శోషణ సులభం అవుతుంది.
మధ్యాహ్న భోజనంతో మజ్జిగ తీసుకోండి.. మీకు మంచి జీర్ణశక్తి కావాలంటే మజ్జిగ తాగడం తప్పనిసరి. ప్రోబయోటిక్ ప్రయోజనాలతో నిండిన మజ్జిగ కడుపును చల్లబరుస్తుంది. ఆమ్లత్వ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే మధ్యాహ్నం భోజన సమయంలో మజ్జిగ తాగితే అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
ఏవి పడితే అవి కలిపి తినకూడదు.. కళ్ల ముందు ఫుడ్డు ఉంది కదా అని ఏది పడితే అది మిక్స్ చేసి తినకూడదు. ఆయుర్వేదంలో అలాంటి కొన్ని ఆహార పదార్థాల గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. వాటికి దూరంగా ఉంటే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. పండ్లు – పాలు, చేపలు – పాలు, తేనె – వేడి నీరు, చల్లని – వేడి ఆహారాలు కలిపి తినకూడదు. ఇవి మీ జీర్ణక్రియ నిమ్మదించడానికి దోహదపడుతాయి.
నానబెట్టిన బీన్స్, పప్పు ధాన్యాలను గింజలను తినాలి.. ప్రతి ఒక్కరూ చిక్కుళ్ళు, ఇతర పప్పు ధాన్యాలను నేరుగా తినడం మనం చూస్తూనే ఉంటాం. కానీ వాటిలో ఫైటిక్ యాసిడ్ ఉంటుందని మీకు తెలుసా?. ఇది మన ప్రేగులకు పోషకాలను గ్రహించడం కష్టతరం చేస్తుంది. అందువల్ల, వాటిని నానబెట్టి తినాలి. వాటిని నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. శరీరంలో సులభంగా జీర్ణమవుతుంది. దీనికంటే వండుకుని తినడం ఉత్తమం.
రోజూ 5,000 అడుగులు నడవండి.. నడక ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు ఎంత ఎక్కువ నడిస్తే.. అంత ఎక్కువగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వ్యాయామం చేయడానికి సమయం దొరకకపోతే.. ప్రతీరోజూ కనీసం 5,000 అడుగులు అయినా నడవాలి. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Also read:
Delhi News: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఆటోరిక్షాపై బోల్తాపడిన కంటైనర్.. నలుగురు మృతి, పరారీలో డ్రైవర్
MLA RK Roja Comments: రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు