AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SS Rajamouli: షూటింగ్ సమయంలో హీరో కష్టసుఖాలు పట్టించుకోను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రాజమౌళి..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి దర్శకత్వంలో పనిచేసేందుకు ప్రతి హీరో

SS Rajamouli: షూటింగ్ సమయంలో హీరో కష్టసుఖాలు పట్టించుకోను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రాజమౌళి..
Rajamouli
Rajitha Chanti
|

Updated on: Dec 19, 2021 | 8:30 AM

Share

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి దర్శకత్వంలో పనిచేసేందుకు ప్రతి హీరో ఎదురుచూస్తుంటారు. ప్రభాస్, రానా ప్రధాన పాత్రలలో నటించిన బాహుబలి సినిమాతో సంచలనం క్రియేట్ చేశాడు రాజమౌళి. బాహుబలితో తెలుగు సినిమమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశాడు జక్కన్న. సినీ రంగంలో బాహుబలి సినిమా రికార్డ్స్ సృష్టించింది. ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలున్నాయి. ఇద్దరూ స్టా్ర్ హీరోలతో అత్యంత ప్రతిష్ట్మాతంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు జక్కన్న.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆర్ఆర్ఆర్ మూవీపై మరింత అంచనాలను పెంచేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‏తో బిజీగా ఉన్నారు రాజమౌళి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో సందడి చేశారు రాజమౌళి. ఈ షోకు రాజమౌళితోపాటు.. ఎంఎం కీరవాణి కూడా విచ్చేశారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ షోలో మెహన్ బాబు, అనిల్ రావిపూడి, బ్రహ్మనందం, నాని, బోయపాటి శ్రీను సందడి చేయగా.. తాజాగా రాజమౌళి, ఎంఎం కీరవాణి బాలయ్యతో కలిసి సందడి చేశారు. ఇందులో బాలకృష్ణ మాట్లాడుతూ.. మనమిద్దరం ఇంతవరకు కలిసి పనిచేయలేదు. బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తారు అని నా అభిమానులు మిమ్మల్ని అడిగితే.. నేను హ్యాండిల్ చేయలేను అన్నారట ఎందుకు అని బాలకృష్ణ ప్రశ్నించాడు. భయంతో అలా అన్నాను.. చిన్నవాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మీరు అందరికీ గౌరవం ఇస్తారు. చాలా పద్దతిగా ఉంటారు. నేను సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటానో నాకు తెలియదు. నాకు ఎవరైనా గుడ్ మార్నింగ్ చెబితో చిరాకు.. షాట్ పెట్టుకుని హీరో ఎండలో నిలబడ్డాడా ? వానలో ఉన్నాడా ? అన్నది చూడను.. నా ఫ్రేమ్ రెడీ అయ్యే వరకు హీరో కష్టసుఖాలు ఆలోచించను.. ఒకవేళ మిమ్మల్ని డైరెక్ట్ చేయాల్సి వస్తే మీకు కోపం వస్తుందేమోనని భయం. నాకు అదే టెన్షన్ అంటూ చెప్పుకొచ్చారు బాలకృష్ణ.

Also Read:  Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతున్నాడా.? దీప్తి ఆ విషయాన్ని చెప్పకనే చెప్పిందా.?

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5 విన్నర్‌ సన్నీనేనా.. రెండో స్థానంలో కూడా నిలవని షణ్ముఖ్‌.? వైరల్‌ అవుతోన్న వార్త..

Bigg Boss 5 Telugu Ep.105: సందడిగా 5వ సీజన్ ఫైనల్ డే.. హౌస్‌లో రచ్చ చేసిన మాజీ కంటెస్టెంట్స్..

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ 5 తెలుగు గ్రాండ్‌ ఫినాలే.. ఎప్పుడు.. ఎక్కడ.. ముఖ్య అతిథులుగా ఎవరు..?