Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5 విన్నర్‌ సన్నీనేనా.. రెండో స్థానంలో కూడా నిలవని షణ్ముఖ్‌.? వైరల్‌ అవుతోన్న వార్త..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. ప్రేక్షకులకు ఫుల్‌ మీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించిన ఈ రియాలిటీ షో ముగింపునకు సమయం ఆసన్నమైంది....

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5 విన్నర్‌ సన్నీనేనా.. రెండో స్థానంలో కూడా నిలవని షణ్ముఖ్‌.? వైరల్‌ అవుతోన్న వార్త..
Biggboss Winner
Follow us
Narender Vaitla

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 19, 2021 | 6:42 PM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. ప్రేక్షకులకు ఫుల్‌ మీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించిన ఈ రియాలిటీ షో ముగింపునకు సమయం ఆసన్నమైంది. మరి కాసేపట్లో బిగ్‌బాస్‌ విన్నర్‌ ఎవరో అధికారికంగా తెలిసిపోనుంది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఇప్పటికే విజేత ఎవరన్న దానిపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తొలి నుంచి షణ్ముఖ్‌ భారీ ఓటింగ్‌తో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా షార్ట్‌ ఫిలిమ్స్‌ ద్వారా యూత్‌కు బాగా కనెక్ట్‌ అయిన షణ్ముఖ్‌ ఓటింగ్‌లో ప్రతీసారి టాప్‌లో నిలుస్తూ వచ్చాడు. అయితే ఇదే క్రమంలో షో ముగింపు దశకు చేరుకునే సమయానికి ఇతర కంటెస్టెంట్‌లు సైతం తమ సత్తా చాటడం ప్రారంభిస్తూ వచ్చారు. ముఖ్యంగా సన్నీ, శ్రీరామచంద్ర ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోయారు.

ఇదే షణ్ముఖ్‌ విజయానికి గండి కొట్టిందనే చర్చ సోషల్‌ మీడియా వేదికగా జరుగుతోంది. ఒక్కసారిగా దూసుకొచ్చిన సన్నీనే ఈ సారి బిగ్‌బాస్‌ టైటిల్‌ను ఎగిరేసుకుపోనున్నాడని తెలుస్తోంది. ఇక విన్నర్‌గా నిలుస్తాడని భావించిన షణ్ముఖ్‌ కనీసం రెండో స్థానంలో నిలవలేదని తెలుస్తోంది. సన్నీ, శ్రీరామ్‌లు మొదటి రెండు స్థానాల్లో నిలిచారని సమాచారం. సన్నీ టైటిల్‌ విజేతగా నిలవగా, శ్రీరామ్‌ చంద్ర రన్నరప్‌గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది సేపు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ టైటిల్‌ విన్నర్‌గా నిలిచిన వారికి రూ. 50 లక్షలు ప్రైజ్ మనీ, ట్రోఫీతో పాటుగా, ఓ బైక్ ను కూడా అందించనున్నారు. ఇక రన్నరప్ గా నిలిచే కంటెస్టెంట్ కు 25 లక్షలు అందించనున్న విషయం తెలిసిందే.

Also Read: Bigg Boss 5 Telugu Grand Finale Live: గ్రాండ్‌గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్.. స్టేజ్ పై సందడే.. సందడే

Chief Justice: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ పర్యటన.. రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

Shyam Singha Roy: నానికి నేనున్నా.. శ్యామ్ సింగరాయ్ కోసం కదిలొస్తున్న బాలయ్యబాబు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..