AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shyam Singha Roy: నానికి నేనున్నా.. శ్యామ్ సింగరాయ్ కోసం కదిలొస్తున్న బాలయ్యబాబు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..

Shyam Singha Roy pre release event: అఖండ సినిమాతో...అన్‌స్టాపబుల్ షో తో మంచి జోరుమీదున్న బాలయ్యబాబు.. తాజాగా నానికి చేయందిస్తున్నాడు. నాని రీసెంట్ ఫిల్మ్ శ్యామ్ సింగరాయ్‌

Shyam Singha Roy: నానికి నేనున్నా.. శ్యామ్ సింగరాయ్ కోసం కదిలొస్తున్న బాలయ్యబాబు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..
Shyam Singha Roy
Shaik Madar Saheb
|

Updated on: Dec 18, 2021 | 6:45 PM

Share

Shyam Singha Roy pre release event: అఖండ సినిమాతో…అన్‌స్టాపబుల్ షో తో మంచి జోరుమీదున్న బాలయ్యబాబు.. తాజాగా నానికి చేయందిస్తున్నాడు. నాని రీసెంట్ ఫిల్మ్ శ్యామ్ సింగరాయ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్యాథిగా విచ్చేయనున్నారు. హైదరాబాద్‌లో ఈరోజు జరిగే ఈవెంట్‌లో నాని అభిమానులతో ముచ్చటించనున్నారు. శ్యామ్ సింగరాయ్ మేకర్స్‌కు బెస్ట్ విషెస్ చెప్పనున్నారు. ఇక ఇటీవలే బాలయ్య టాక్‌ షోలో సందడి చేశారు నాని. ఇండస్ట్రీలో తాను ఎదిగిన క్రమాన్ని.. బాలయ్య సినిమాల కోసం థియేటర్ల చుట్టూ తిరిగిన ఆనాటి సంగతులను గుర్తుకు చేసుకున్నారు. బాలయ్యతో సరదాగా మాట్లాడుతూ.. షోలో గేమ్స్‌ ఆడుతూ.. తెగ ఎంజాయ్‌ చేశారు నాని. ఇక అంతకు ముందు కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాలో బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్‌గా నటించారు నాని. బాలయ్య పేరును చేతిపై పచ్చ బొట్టు పొడిపించుకుని మరీ ఆ సినిమాలో బాలయ్య పేరును జపించారు. ఇంట్రడక్షన్‌ సీన్లో బాలయ్యలా రౌడీలను చితక్కొట్టారు.

ఆహా అన్‌స్టాపబుల్ షో తరువాత ఇక ఇప్పుడు వీరిద్దరు మరోసారి ఓకే వేదికపై కనిపించబోతున్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఇవ్వాల జరిగే శ్యామ్‌ సింగరాయ్‌ ఈ వెంట్‌లో సినీ అభిమానులకు కనువిందు చేయనున్నారు. ఇక నాని ఫిల్మ్ కెరీర్‌లోనే ది మోస్ట్ అవేటెడ్ మూవీ గా తెరకెక్కిన సినిమా శ్యామ్‌ సింగరాయ్. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో పీరియాడికల్ కథాంశంతో వస్తోంది. ఈ సినిమాలో నాని నాటి బెంగాళ్ విప్లవ యోధుడిగా.. ఈతరం షార్ట్ ఫిల్మ్ మేకర్గా రెండు క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి దేవదాసిగా.. శ్యామ్‌ సుందరాయ్‌ ప్రేమసిగా కనిపించనున్నారు. మరో హీరోయిన్ కృతి అప్‌కమింగ్‌ యాక్టరస్‌గా నటించనున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌ గా పనిచేస్తున్నారు. ఇక ఈయన స్వరపరిచిన సాంగ్స్‌ ఇప్పటికే రిలీజై యూట్యూబ్ లో మంచి వ్యూస్‌ సాధిస్తూ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. వీటికి తోడు రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమాను ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్‌ అవునున్న ఈ సినిమా కోసం అందర్నీ వెయిట్ చేసేలా చేస్తోంది.

లైవ్ వీడియో..