AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHA Unstoppable: బాలకృష్ణ అంటే రాజమౌళికి ఎందుకు భయం.. ఆహా అన్‌స్టాపబుల్‌లో జక్కన్న ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

AHA Unstoppable: ఓటీటీ రంగంలో సరికొత్త శకానికి నాంది పలికిన తొలి తెలుగు ఓటీటీ ఆహా.. అన్‌స్టాపబుల్‌ పేరుతో టాక్‌ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టాక్‌ షోకు ఏకంగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా ..

AHA Unstoppable: బాలకృష్ణ అంటే రాజమౌళికి ఎందుకు భయం.. ఆహా అన్‌స్టాపబుల్‌లో జక్కన్న ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..
Aha
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 19, 2021 | 8:16 AM

Share

AHA Unstoppable: ఓటీటీ రంగంలో సరికొత్త శకానికి నాంది పలికిన తొలి తెలుగు ఓటీటీ ఆహా.. అన్‌స్టాపబుల్‌ పేరుతో టాక్‌ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టాక్‌ షోకు ఏకంగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా  వ్యవహరించడంతో అందరి చూపు ఈ షోపై పడింది. అప్పటి వరకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మాత్రమే తెలిసిన బాలయ్య తొలిసారి యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ప్రశ్నలు అడగడంపై అందరూ ఆసక్తితో ఎదురుచూశారు. అయితే అభిమానుల అంచనాలను ఏమాత్రం తగ్గకుండా బాలయ్య అన్‌స్టాపబుల్‌ను నిజంగానే జెట్‌ స్పీడ్‌తో తీసుకెళుతున్నారు. ఇప్పటి వరకు ఆహా వేదికగా ప్రసారమైన నాలుగు ఎపిసోడ్‌లు సంచలనంగా మారాయి. ఇక తాజాగా 5వ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు ఆహా టీమ్‌.

ఈసారి షోలో టాలీవుడ్‌ అగ్ర దర్శకుడు రాజమౌళి పాల్గొననున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ప్రోమోలో భాగంగా బాలకృష్ణ, రాజమౌళితో మాట్లాడుతూ.. ‘ఇప్పటి దాకా మన కాంబినేషన్‌లో సినిమా పడలేదు. నా అభిమానులు అడిగారని నాకు తెలుసు.. మీరు నన్ను హ్యాండిల్‌ చేయలేరని అన్నారంటగా’ అని ప్రశ్నించగా దానికి బదులిచ్చిన జక్కన్న.. ‘నిజానికి నాకు భయం సార్‌. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను.. మీకు కోపం వస్తే ఆగరు. ఎదుటి మనిషి ఎవరు.? ఏంటి అని చూడకుండా నోటికి ఎంతమాట వస్తే అంత మాట తిట్టేస్తారు’ అని సమాధానం ఇచ్చారు. దీనికి బాలకృష్ణ బదులిస్తూ ఎవరో డైరెక్టర్‌తో జరిగిన సంఘటనను గుర్తుచేస్తూ.. ‘స్క్రిప్ట్‌ తీసి నేలపై కొట్టి నేను ఈ సినిమా చేయను’ అని చెప్పేశాను అని ఘాటుగా సమాధనం ఇచ్చారు.

దీంతో జక్కన్న ‘అలా అయితే మీరు చేసింది తప్పని’ చెప్పుకొచ్చారు. దీనికి బాలయ్య రిప్లై ఇస్తూ.. ‘అలా అయితే నేను బాలయ్యను కాదు.. బాలయ్య కాక్‌టేల్‌’ అని అనగానే రాజమౌళి ఒక్కసారిగా నవ్వేశారు. ఇలా ప్రోమో అంతా సందడిగా సాగింది. ఇక ఈ షోలో సంగీత దర్శకుడు కీరవాణి కూడా హాజరయ్యారు. ప్రోమోనే ఇంత ఆసక్తికరంగా ఉంటే ఇక ఫుల్‌ ఎపిసోడ్‌ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. మరి ఈ అన్‌స్టాపబుల్‌ విత్‌ బాలయ్య లేటెస్ట్‌ ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Healthy Relationship Tips: ఈ నాలుగు అలవాట్లు ఒక జంట విడిపోవడానికి కారణమవుతాయి.. వెంటనే వీటిని వదులుకోండి..!

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ ఫినాలే.. గెలిచేది ఎవరంటే.. కంటెస్టెంట్ల బలాలు, బలహీనతలు

Shocking Video: శునకమా మజాకా.. మీరు కూడా ఇంత ఫర్‌ఫెక్ట్‌గా సిగ్నల్స్ ఇవ్వరంతే..!