Shocking Video: శునకమా మజాకా.. మీరు కూడా ఇంత ఫర్‌ఫెక్ట్‌గా సిగ్నల్స్ ఇవ్వరంతే..!
Shocking Video: ఫన్నీ వీడియోలకు కేరాఫ్ అడ్రస్ సోషల్ మీడియా అని చెప్పుకొవచ్చు. నెట్టింట్లో అన్ని రకాల వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి.
Shocking Video: ఫన్నీ వీడియోలకు కేరాఫ్ అడ్రస్ సోషల్ మీడియా అని చెప్పుకొవచ్చు. నెట్టింట్లో అన్ని రకాల వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని వీడియోలు మాత్రం పొట్ట చెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని మనుషులను ఆలోచింప చేస్తాయి. ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా ఓ కుక్కకు సంబంధించి వీడియో నవ్వు తెప్పించడంతో పాటు.. ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఔరా.. ఇదేం కుక్క.. ఇంత టాలెంట్ ఎలా వచ్చింది అనే సందేహం కలుగక మానదు. ఆ వీడియోను ఒకసారి చూస్తే.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది.
సాధారణంగా కారును పార్క్ చేయాలంటే బ్యాక్ మిర్రర్, కారు వెనుకవైపు ఉన్న కెమెరా ఆధారంగా పార్కింగ్ చేస్తారు. మరికొందరయితే.. వెనుక వైపు సిగ్నల్స్ ఇస్తుంటే దాని ఆధారంగా కారును పార్క్ చేస్తారు. అయితే, ఇక్కడ ఓ వ్యక్తి కారు పార్క్ చేస్తుండగా.. పెంపుడు కుక్క అద్భుత రీతిలో సాయం చేసింది. కారును పార్క్ చేసేందుకు సిగ్నల్స్ ఇచ్చింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుత రచ్చ రచ్చ చేస్తోంది.
ఈ వైరల్ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఈ వీడియోలో ఓ కుక్క తన యజమాని కారు పార్క్ చేసేందుకు ఊహించని రీతిలో సాయం చేసింది. కారు పార్క్ చేస్తుండగా వెనుకవైపు నిల్చుని సిగ్నల్స్ ఇచ్చింది. వెనక్కి రావాలంటూ కాలితో సంజ్ఞలు ఇచ్చింది. సరిగ్గా పార్కింగ్ ప్లేస్‌లోకి రాగానే ఆ కుక్క స్టాప్ చెప్పడం మరో అద్భుతం. మొత్తానికి కుక్క ఇచ్చే సిగ్నల్స్ ఆధారంగా కారు డ్రైవర్ కారును పార్క్ చేశాడు. అయితే, దీనంతటినీ వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ rvcjinsta లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ వీడియో చూసి షాక్ అవుతున్నారు. కుక్క తెలివికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కుక్క సిగ్నల్స్ ముందు ఏ సెన్సా్ర్ అయినా బలాదూరే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వీడియోను మళ్లీ మళ్లీ చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ‘అమేజింగ్ డాగ్, నా కుక్కకు కూడా ఇలాంటి శిక్షణే ఇస్తాను.’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.
Viral Video:
View this post on Instagram
Also read:
Delhi News: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఆటోరిక్షాపై బోల్తాపడిన కంటైనర్.. నలుగురు మృతి, పరారీలో డ్రైవర్
MLA RK Roja Comments: రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు