Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతున్నాడా.? దీప్తి ఆ విషయాన్ని చెప్పకనే చెప్పిందా.?

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షో 5వ సీజన్‌ ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. గత 4 సీజన్‌లతో పోలిస్తే ఈ సీజన్‌ మరింత ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా చివరిగా ఇంట్లో మిగిలిన...

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతున్నాడా.? దీప్తి ఆ విషయాన్ని చెప్పకనే చెప్పిందా.?
Follow us
Narender Vaitla

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 19, 2021 | 6:42 PM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షో 5వ సీజన్‌ ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. గత 4 సీజన్‌లతో పోలిస్తే ఈ సీజన్‌ మరింత ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా చివరిగా ఇంట్లో మిగిలిన 5గురు కంటెస్టెంట్‌ల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో విజేతగా ఎవరు నిలుస్తారనేదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం హౌస్‌లో శ్రీరామ్‌ చంద్ర, సిరి, మానస్‌, షణ్ముఖ్‌, సన్నీలు ఉన్నారన్న విషయం తెలిసిందే. వీరిలో ఒకరిని ఈరోజు (ఆదివారం) విన్నర్‌గా ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలోనే విన్నర్‌ ఎవరన్న దానిపై ఎవరు అంచనాలు వారు వేసుకుంటున్నారు. మొదటి నుంచి ఈసారి టైటిల్‌ను గెలుచుకునేది షణ్ముఖ్‌ అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ అంచనా తలకిందులు అయినట్లు తెలుస్తోంది. ఈసారి టైటిల్‌ కొట్టేది సన్నీ అనే వాదన కొత్తగా తెరపైకి వచ్చింది. ఈ విషయమై ఇప్పటికే సోషల్‌ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది.

Biggboss Finale

ఇదిలా ఉంటే తాజాగా షణ్ముక్‌ ప్రేయసి దీప్తి సునయన చేసిన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ కొత్త ప్రశ్నలు పుట్టుకొచ్చేలా చేశాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో దీప్తి మొదటి పోస్ట్‌లో.. ‘షణ్ముఖ్‌కు మద్ధతు నిలిచి, మీ ప్రేమను అందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చింది. ఇక వెంటనే మరో పోస్ట్‌లో.. ‘జీవితంలో ప్రతీది ఏదో ఒక కారణంతోనే జరుగుతుంది’ అనే క్యాప్షన్‌ పోస్ట్‌ చేసింది. దీంతో ఇదే ఇప్పుడు అనుమానాలకు దారి తీసింది. ఈ లెక్కన షణ్ముఖ్‌ విజయాన్ని సాధించలేదన్న విషయం తెలిసే దీప్తి ఇలా పోస్ట్‌ చేసిందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి బిగ్‌బాస్‌ ఎలాంటి సర్‌ప్రైజ్‌ను ప్లాన్‌ చేశాడో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Also Read: Bigg Boss 5 Telugu Grand Finale Live: గ్రాండ్‌గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్.. స్టేజ్ పై సందడే.. సందడే

AP Liquor: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు

AP Politics: ముఖ్యమంత్రి అభయంతో ఉత్కంఠకు తెర.. రాజీనామా చేసిన కీలక నేత..!