Bigg Boss 5 Telugu Ep.105: సందడిగా 5వ సీజన్ ఫైనల్ డే.. హౌస్‌లో రచ్చ చేసిన మాజీ కంటెస్టెంట్స్..

Venkata Chari

| Edited By: Narender Vaitla

Updated on: Dec 18, 2021 | 10:39 PM

Bigg Boss Telugu 5 Live Updates: ఇన్ని రోజులు బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసిన బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. దాదాపు 106 రోజుల ప్రయాణం తరువాత బిగ్ బాస్‌ ఇవ్వాల్టి ఫినాలే ఘట్టంతో ముగియనుంది.

Bigg Boss 5 Telugu Ep.105: సందడిగా 5వ సీజన్ ఫైనల్ డే.. హౌస్‌లో రచ్చ చేసిన మాజీ కంటెస్టెంట్స్..
Bigg Boss 5 Telugu

Bigg Boss Telugu 5: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో విజయవంతంగా 5వ సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. తాజాగా శనివారం చివరి ఎపిసోడ్‌ సందడిగా సాగింది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఇంతకు ముందు బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్‌ హరితేజ, గీతా మాధురి, రోల్ రైడా, శివబాలాజీ, శివజ్యోతి, రాహుల్ సిప్లిగంజ్, అఖిల్‌ సార్థక్‌లు హౌస్‌లోకి వచ్చారు.

అయితే హౌస్‌లోకి నేరుగా ఎంటర్‌ కాకుండా సెపరేట్‌ రూమ్‌లో కూర్చొని హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్‌లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాజీ కంటెస్టెంట్‌లు తమ గత అనుభవాలను పంచుకుంటూ సందడి చేశారు. హౌస్‌మేట్స్‌ తప్పు ఒప్పులను చెబుతూ ఈసారి సీజన్‌లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయన్న విషయాలను తెలిపారు. ఇలా ఈరోజు ఎపిసోడ్‌ సందడిగా సాగింది. ఇక రేపు (ఆదివారం) ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి టైటిల్‌ను ఎవరు గెలుచుకుంటారోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరి బిగ్‌బాస్‌ 5వ సీజన్‌లో ఎవరు విజేతగా నిలవనున్నారో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Dec 2021 10:28 PM (IST)

    అరియానా, అఖిల్‌ల హంగామా..

    బిగ్‌బాస్‌ సీజన్‌ 5 చివరి రోజు బిగ్ బాస్‌ మాజీ కంటెస్టెంట్‌లు రచ్చ చేస్తున్నారు. తాజాగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అరియానా, అఖిల్‌ హంగామా చేశారు. హౌస్‌మేట్స్‌తో సందడి చేశారు.

  • 18 Dec 2021 10:16 PM (IST)

    హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శివ బాలాజీ, హరితేజ..

    Biggboss

     

    బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ముగుస్తున్న నేపథ్యంలో 105 ఎపిసోడ్‌లో భాగంగా మొదటి సీజన్‌కు చెందిన శివబాలాజీ, హరితే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా వీరిద్దరు సందడి చేశారు. ముఖ్యంగా షణ్ముఖ్‌, సిరిలను ఇమిటేట్‌ చేస్తూ నవ్వులు పూయించారు. సిరి, షణ్నుల మధ్య మంచి స్నేహబంధం ఉందంటూ హరితేజ చెప్పుకొచ్చింది. ఇక హౌస్‌లోని సన్నీ, శ్రీరామ్‌ చంద్‌ల గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు శివ బాలాజీ, హరితేజ.

  • 18 Dec 2021 10:12 PM (IST)

    సిరి విన్నర్‌గా నిలిచేనా.?

    క్యూట్ స్మైల్‌తో.. నాటీ అల్లరితో బిగ్ బాస్‌ జెర్నీని టేకాఫ్ చేసింది సిరి. టేకాఫ్ చేయడమే కాదు… తన నెవర్ గివప్‌ యాటిట్యూడ్‌తో క్రేజ్‌.. అండ్ ఫాలోయింగ్‌లో స్కై హై వరకు వెళ్లొచ్చింది. కాని షణ్ను కారణంగా ఉన్నట్టుండి క్రాష్ ల్యాండ్‌ అయింది. ఫ్రెండ్ అంటూనే షణ్నుతో మితిమీరి ప్రవర్తించడం సిరి ఫాలోవర్స్ను ఇరుకునబెట్టింది. హగ్గులు.. ముద్దులతో రెచ్చి పోవడం.. వారికి చిరాకు తెప్పించింది. వాటికి తోడు షణ్ను ఆడమన్నట్లు ఆడడం.. షణ్నును లోకంగా మార్చుకుని మిగిలిన వారితో రాపో బిల్డ్‌ చేసుకోకపోవడం.. సిరికి తన ఫాలోవర్స్ను దూరం చేసింది. ఇక అమ్మ ఎపిసోడ్‌.. ఆ ఎపిసోడ్‌ తరువాత బాహాటంగా సిరి అమ్మపైనే షణ్ను విమర్శలు చేయడం.. అందుకు సిరి సైలెంట్‌గా ఉండడం.. లాంటి సీన్లు.. ఈ దూరాన్ని మరింతగా పెంచాయి. అయితే బయట ఉన్న సిరి బాయ్‌ ఫ్రెండ్ శ్రీహాన్… సిరి గెలుపుకోసం తీవ్రంగా శ్రమించడం ఈ బ్యూటీకి కాస్త కలిసొచ్చే అంశం. తన టీంతో సిరికి మద్దతుగా పోస్టులు పెట్టడం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో గట్టిగా ప్రచారం చేయడం.. ఈ బ్యూటీని టాప్‌ 5 ముందు వరుసలో నిలిపేలా చేస్తాయన్నది.. బీబీ ఫాలోవర్స్ మనోగతం.

  • 18 Dec 2021 09:59 PM (IST)

    యూట్యూబ్‌లో సంచలనం.. మరి బిగ్‌బాస్‌ విజేత అయ్యేనా?

    యూట్యూబర్‌గా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుని హౌస్‌లోకి ఎంటరయ్యాడు షణ్ముఖ్ జస్వంత్. తన పాపులారిటీతో.. సైలెంట్ యాటిట్యూడ్‌తో షో మొత్తం లాక్కొచ్చిన ఈ చిన్నోడు.. ఫైనల్స్‌లోనూ ముందు వరుసలో నిలిచేలా కనిపిస్తున్నాడు. షో మొత్తంలో తక్కువ సార్లు నామినేట్ అయి.. సీజన్ 5 లాస్ట్ కెప్టెన్‌ గా రికార్డుకెక్కిన షణ్ను.. టాస్కుల్లో మాత్రం తన ముద్ర చూపించలేక పోయాడు. మోజో రూమ్‌కే పరితమై.. సిరి, జెస్సీ తో తన చుట్టూ ఓ జోన్‌ ను ఏర్పాటు చేసుకుని.. బిగ్ బాస్‌ హౌస్‌ను మోటల్ గా మార్చేశాడనే నెగెటివ్‌ కామెంట్ మనోడి మీదుంది. బిగ్‌ బాస్‌ బ్రహ్మగా ఫీలవుతూ.. టాస్కులు.. లైట్ తీసుకుంటాడనే కంప్లైట్ ఎక్కువగా వినిపిస్తోంది. అయితే షణ్నుకున్న ఫాలోయింగ్.. బయట నుంచి క్యాంపెయిన్ చేస్తున్న టీం.. అండ్ ఫ్యామిలీ ఇతని గెలుపు కోసం ఫైట్ చేస్తోంది. షణ్నుకు టైటిల్ కట్టబట్టే ప్రయత్నం చేస్తోంది.

  • 18 Dec 2021 09:57 PM (IST)

    ఇండియన్ ఐడెల్‌.. బిగ్‌బాస్ విన్నర్ కాగలడా?

    ఇప్పటికే ఉన్న ఇండియన్ ఐడెల్ ట్యాగ్తో బిగ్ బాస్‌ సీజన్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీరామచంద్ర.. తన కూల్ గేమ్‌తో.. టాప్‌లో ఉంటాడనే ఫీల్ను బీబీ ఫాలోవర్స్‌కు ఎప్పుడో కలిగించాడు. తన మెలోడీ వాయిస్‌తో పాటలు పాడుతూ… ఇంట్లో అండ్‌ బయట ఉన్న అమ్మాయిలను ఇంప్రెస్ చేస్తూ.. టాస్కుల్లో టఫ్‌ ఫైట్ ఇస్తూ… విన్నింగ్ కంటెండర్గా పేరు తెచ్చుకున్నాడు. హమీదాతో జత కట్టి హౌస్‌లో సెంట్రాఫ్‌ అట్రాక్షన్ గా నిలిచి… లవర్‌ బాయ్ అనే పేరు తెచ్చుకున్నాడు కూడా..! అయితే టాస్కుల్లో.. నామినేషన్లో ఎక్కువ కన్ఫీజ్‌ అవ్వడం.. ఏదైనా విషయాన్ని పదే పదే లాగుతుండడం.. హమీద ఎలిమినేట్ అయ్యాక సైలెంట్ అయిపోవడం మనోడికి మైనస్‌ పాయింట్స్‌ లిస్టవుట్ అవుతున్నాయి. అయితే శ్రీరామ్ ఫ్యామిలీ అండ్ సింగర్ ఫెటర్నిటీ ఇతని కోసం చేస్తున్న క్యాంపెయిన్ ఈ సింగర్‌ ను నెంబర్‌ వన్‌ రేసులో నిలిచేలా చేస్తాయన్న టాక్‌ ఇండస్ట్రీలో ఉంది.

  • 18 Dec 2021 09:55 PM (IST)

    మానస్.. బిగ్‌బాస్ మనసు గెలుచుకోగలడా?

    కూల్ అండ్ కామ్‌గా.. స్టడీ అండ్ కాంస్టాంట్‌గా బిగ్ బాస్‌ హౌస్లో సర్వైవ్‌ అయ్యాడు మానస్. కంటెస్టెంట్స్‌తో ఎక్కువగా గొడవలు పెట్టుకోకుండా.. టాస్కుల్లో తన ఇంటలిజెన్స్‌ను చూపిస్తూ.. ఆడియెన్స్ను ఇంప్రెస్ చేశాడు ఈ బాయ్. మధ్యలో ప్రియాంక సింగ్ తో సపరియలు చేయించుకోవడం.. ఆమెలో లేనిపోని ఆశలు రేపడం వంటవి అటుంచితే… మిగిలిన విషయాల్లో మనోడు మిస్టర్ పర్ఫెక్ట్ అన్నది టాక్. అటు ఫ్రెండ్‌ షిప్‌లోనూ.. ఇటు ఇంటి పనుల్లోనూ.. మిగతా కంటెస్టెంట్స్‌కు హెల్ప చేయడంలోనూ మనోడే బెస్ట్. ఇక ఇంటి బయటి నుంచి మానస్‌ ఫ్యామిలీ అండ్ సపోర్టర్స్ చేస్తున్న క్యాంపెన్ కూడా ఇతనికి కలిసొచ్చే పాయింట్. మానస్ చైల్డ్ ఆర్టిస్ట్‌ కావడం.. సీరియళ్లలో నటిస్తుండడంతో.. టెలివిజన్ ఇండస్ట్రీ కూడా మానస్ ను గెలవాలని కాస్త గట్టిగానే కోరుకొంటోంది.

  • 18 Dec 2021 09:41 PM (IST)

    సన్నీ.. ది విన్నర్ అయ్యేనా?

    బిగ్ బాస్ సీజన్ 5 పస్ట్‌ డే నుంచి తన ఎనర్జటిక్ బిహేవియర్తో… మాటలతో బీబీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాడు సన్నీ. వీజేగా తన కెరీర్‌ ఇనీషియల్ డేస్‌లోనే యూత్‌ను అట్రాక్ట్ చేసిన ఈ బాయ్‌.. ఆ తరువాత సీరియల్లో యాక్ట్ చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ను తన వైపు తిప్పుకున్నాడు. ఇక బిగ్ బాస్‌లో దోస్తానీకి కేరాఫ్ అడ్రస్‌గా…టాస్కుల్లో ఫైటర్‌గా.. ఇంట్లో రౌడీగా పేరు తెచ్చుకుని ఇన్ని రోజులు హౌస్‌లో సర్వైవ్‌ అయ్యాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్‌ సీజన్‌5లో ఫైనల్ ముంగిట నిలిచాడు. తనుకు మైనస్‌గా ఉన్న కోపాన్ని కూడా కాస్త తగ్గించుకుని గెలిచే అవకాశాలను కూడా పెంచుకున్నాడు.

  • 18 Dec 2021 09:27 PM (IST)

    బిగ్ బాస్‌ సీజన్ 5 టైటిల్ విజేత ఎవరో?

    సన్నీ, మానస్‌, శ్రీరామ్, షణ్ను, సిరి! ఈ ఐదుగురు కంటెస్టెంట్స్‌ ల్లో ఎవరు బిగ్ బాస్‌ సీజన్ 5 టైటిల్ను గెలుస్తారనే ఉత్కంఠత అందర్లోనూ నెలకొంది. మరి వీరిలో ఎక్కువ ఎవరికి గెలిచే ఛాన్సుంది.? ఆడియన్స్‌ ఎవరికి మద్దతుగా నిలవనున్నారు.? అనే ఊహాగానాలకు మరికొద్దిసేపట్లో తెరపడనుంది.

Published On - Dec 18,2021 9:21 PM

Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?