Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రచ్చ చేసిన మాజీ కంటెస్టెంట్స్.. సిరి, షణ్ముఖ్‌లను ఓ ఆటాడుకున్నారుగా..
బిగ్‌బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. ఈరోజు బిగ్‌బాస్ విన్నర్ ఎవరనేది తేలీపోనుంది. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్ లో మాజీ కంటెస్టెంట్స్
బిగ్‌బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. ఈరోజు బిగ్‌బాస్ విన్నర్ ఎవరనేది తేలీపోనుంది. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్ లో మాజీ కంటెస్టెంట్స్ రచ్చ చేశారు. ఫస్ట్ సీజన్ నుంచి ఫోర్త్ సీజన్ వరకు కంటెస్టెంట్స్ వచ్చి సందడి చేసి.. హౌస్ మేట్స్‌ను ఓ ఆటాడుకున్నారు. మొదటగా ఫస్ట్ సీజన్ నుంచి శివబాలాజీ, హరితేజ ఎంట్రీ ఇచ్చారు. ఒక్కో కంటెస్టెంట్‌ను ఇమిటేట్ చేసి అలరించారు. ఆ తర్వాత సన్నీపై అలా అరిచేశావ్ ఏంటీ మొన్న అంటూ సిరికి కౌంటర్ వేశాడు శివబాలాజీ. సిరి ప్రవర్తనను శివబాలాజీ ఇమిటేట్ చేయగా.. నన్ను ఇమిటేట్ చేయకు అంటూ పంచ్ వేసింది హరితేజ.
ఇక ఆ తర్వాత.. అన్ని ఆలోచిస్తూ కన్ఫ్యూజ్ అవ్వకు.. అని షన్నూకు శివబాలాజీ సలహా ఇవ్వగా.. నువ్వు షన్నూ కోసం ఏమైనా త్యాగం చేయి కానీ.. టైటిల్ మాత్రం త్యాగం చేయకమ్మా అంటూ సిరికి చురకవేసింది హరితేజ. ఇక ఆ తర్వాత.. శివబాలాజీ, సిరి పీపా పట్టుకుని ఊదితే ఆ పాటేంటో ఇంటి సభ్యులను చెప్పమన్నారు. అయితే పాటను సరిగ్గా గెస్ చేసి సిరి, షణ్ముఖ్ కలిసి డ్యాన్స్ చేశారు. మిగిలిన ముగ్గురు మాత్రం సింగిల్‌గా డ్యాన్స్ చేయగా.. వీరిపైన జాలి చూపించింది హరితేజ. ఆ తర్వాత.. హరితేజ.. బిగ్‌బాస్ షో గురించి, టాప్ 5 కంటెస్టెంట్ల గురించి హరికథ చెప్పారు.
ఇక ఆ తర్వాత సెకండ్ సీజన్ నుంచి రోల్ రైడా.. గీత మాధురి వచ్చి సందడి చేశారు. సిరి, షణ్ముఖ్ రిలేషన్ పై సెటైర్స్ వేస్తూ ఆటపట్టించారు. ఫైనల్ వీక్ లో కూడా గొడవ పడతారా అంటూ సిరికి చురక వేసింది గీతామాధురి. అంతేకాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు సిరి ఆదర్శం అంటూ ఆమెను పొగడ్తలతో ముంచేత్తాడు రోల్ రైడా. అయితే తనపై చిన్న పంచ్ వేస్తేనే తట్టుకోలేని షణ్ముఖ్.. అందరూ వచ్చి సిరిని.. తనను అనేసరికి తెగ ఫీలయ్యాడు. మనిద్దరం హైలెట్ అయిపోతున్నామని.. ఆ ముగ్గురికీ మండిపోతున్నట్లుందని సిరితో వాపోయాడు. అయితే సిరి మాత్రం ఏ షిప్ అయినా బిగ్‌బాస్ వరకే అని షన్నూ చెప్పిన మాటలను గుర్తుచేసుకుని బాధపడింది. దీంతో మరోసారి సిరిని హగ్ చేసుకుని ఓదార్చాడు షన్నూ. ఇది చూసిన సన్నీ.. బయటకు వెళ్లాగ.. షన్నూ హగ్ గురూ అయిపోతాడని కామెంట్ చేశాడు.
Bigg Boss 5 Telugu Ep.105: సందడిగా 5వ సీజన్ ఫైనల్ డే.. హౌస్‌లో రచ్చ చేసిన మాజీ కంటెస్టెంట్స్..
Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ 5 తెలుగు గ్రాండ్ ఫినాలే.. ఎప్పుడు.. ఎక్కడ.. ముఖ్య అతిథులుగా ఎవరు..?