Sukumar: ఆ విషయం చెప్పగానే సమంత స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంది.. డైరెక్టర్ సుకుమార్ ఓపెన్ కామెంట్స్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది. ఎర్ర చందనం

Sukumar: ఆ విషయం చెప్పగానే సమంత స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంది.. డైరెక్టర్ సుకుమార్ ఓపెన్ కామెంట్స్..
Sukumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 19, 2021 | 12:14 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఇందులో బన్నీ నటనకు ప్రశంసలు అందుతున్నాయి. అయితే ఈ మూవీ విడుదల కంటే ముందే ఇందులోని సాంగ్స్ రికార్డ్స్ సృష్టించాయి. ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాట యూట్యూబ్‏లో సంచలనం సృష్టించింది.

హీరోయిన్ సమంత తొలిసారి స్పెషల్ సాంగ్ చేయడం.. చంద్రబోస్ లిరిక్స్, ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహన్ మత్తు వాయిస్‏కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ సాంగ్ నెట్టింట్లో మిలియన్ వ్యూస్‏తో షేక్ చేస్తుంది. ఇక థియేటర్లలో సమంత స్పెషల్ సాంగ్ చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా విడుదల అనంతరం శనివారం హైదరాబాద్‏లో విలేకర్ల సమావేశం నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సమావేశంలో పాల్గొన్న డైరెక్టర్ సుకుమార్.. సమంత స్పెషల్ సాంగ్ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా.. సమంత తొలిసారి స్పెషల్ సాంగ్ చేయడానికి వెంటనే ఒప్పుకుందా ? అని ప్రశ్నించగా.. సుకుమార్ స్పందిస్తూ.. ఈ పాట గురించి సమంతకు చెప్పగానే తనకు కరెక్ట్ కాదని ఆమె చెప్పిది. అయితే నటిగా ఇది మీకు కొత్తగా ఉంటుందని.. ఈ సాంగ్ మీకు బాగా యాప్ట్ అవుతుందని చెప్పి తానే సమంతను ఒప్పించినట్లు చెప్పారు సుకుమార్. రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ప్రస్తావన తీసుకొచ్చినా కూడా సమంత నో చెప్పిందని.. ఆ తర్వాత తన మాటపై నమ్మకంతో ఓకే చెప్పి ఈ సాంగ్ చేసిందని సుకుమార్ చెప్పారు.

Also Read:  Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతున్నాడా.? దీప్తి ఆ విషయాన్ని చెప్పకనే చెప్పిందా.?

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5 విన్నర్‌ సన్నీనేనా.. రెండో స్థానంలో కూడా నిలవని షణ్ముఖ్‌.? వైరల్‌ అవుతోన్న వార్త..

Bigg Boss 5 Telugu Ep.105: సందడిగా 5వ సీజన్ ఫైనల్ డే.. హౌస్‌లో రచ్చ చేసిన మాజీ కంటెస్టెంట్స్..

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ 5 తెలుగు గ్రాండ్‌ ఫినాలే.. ఎప్పుడు.. ఎక్కడ.. ముఖ్య అతిథులుగా ఎవరు..?