Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్5 గ్రాండ్ ఫినాలేకు అటెండ్ అవ్వనున్న బిగ్ స్టార్స్ వీరే ..
బిగ్ బాస్ సీజన్ 5 ముగింపుకు వచ్చేసింది. నేటితో బిగ్ బాస్ సీజన్ 5 ముగుస్తుంది. ఇక హౌస్ లో ఉన్న ఐదుగురిలో ఒకరు విజేత కానున్నారు.
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 ముగింపుకు వచ్చేసింది. నేటితో బిగ్ బాస్ సీజన్ 5 ముగుస్తుంది. ఇక హౌస్ లో ఉన్న ఐదుగురిలో ఒకరు విజేత కానున్నారు. సిరి, షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్, మానస్ ఈ ఐదుగురిలో ముందుగా ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు. ఇక మిగిలిన ముగ్గురిలో ఒకరు విన్నర్ అవుతారు. ఎవరు బిగ్ బాస్ ట్రోఫీని అందుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నేటి ఎపిసోడ్ గ్రాండ్ గా నిర్వహనించనున్నారు. ఈ ఫైనల్ కోసం పెద్ద పెద్ద స్టార్స్ ను స్టేజ్ పై తీసుకు రానున్నాడు నాగార్జున. ఈ ఫైనల్ లో దర్శక ధీరుడు రాజమౌళి, బాలీవుడ్ స్టార్స్ రణ్ బీర్ కపూర్ సందడి చేయనున్నారు. అలాగే నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి, రష్మిక దేవీశ్రీప్రసాద్, సుకుమార్, జగపతిబాబు, గెస్టులు రానున్నారు.
వీరితోపాటు స్టార్ హీరోయిన్ శ్రీయ తన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకోనున్నారు. అలాగే పుష్ప సామీ స్టెప్ తో రష్మిక అదరగొట్టగా.. సుకుమార్ ఈ స్టెప్ వేయాలంటూ నాగ్ సరదాగా నవ్వేసారు. అలాగే సన్నీ ఆర్.ఆర్.ఆర్ ని మిస్సయ్యాం అనగానే ఆర్.ఆర్.ఆర్ ఎప్పుడో రిలీజైపోయింది! అంటూ రాజమౌళి ఆటపట్టించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ అలియా బాలయ్య డైలాగ్ చెప్పి అదరగొట్టింది. పుష్పలో ఈ పాటలో సమంత వేడెక్కించే స్టెప్పులు వేసిన ఉ అంటావా ఊఉ అంటావా పాటకు డింపుల్ హయతి స్టెప్పులేసింది. మొత్తానికి గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గా ఉండబోతుందని ప్రోమోతో చెప్పేసారు.
మరిన్ని ఇక్కడ చదవండి :