Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brown Rice Benefits: డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్ ఎందుకు తినాలో తెలుసా.. సరికొత్త పరిశోధనల్లో తేలింది ఇదే..

భారతీయ ఆహారం అన్నం లేకుండా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే కార్బోహైడ్రేట్లు , ఫైబర్ వీటిలో చాలా ఉంటాయి. అయితే..

Brown Rice Benefits: డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్ ఎందుకు తినాలో తెలుసా.. సరికొత్త పరిశోధనల్లో తేలింది ఇదే..
Brown Rice Benefits
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 19, 2021 | 4:24 PM

Brown Rice Benefits: భారతీయ ఆహారం అన్నం లేకుండా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే కార్బోహైడ్రేట్లు , ఫైబర్ వీటిలో చాలా ఉంటాయి. అయితే, వైట్ రైస్.., బ్రౌన్ రైస్‌లో దేని ప్రయోజనాలు దానివే.. అయితే.. పోషకాహార నిపుణుడు భువన్ రస్తోగి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో బ్రౌన్ రైస్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పారు. బియ్యం శరీరానికి అవసరమైన అనేక పోషకాలను కలిగి ఉంటుంది. తరచుగా ప్రజలు వైట్ రైస్, బ్రౌన్ రైస్ మధ్య ఏది మంచిదో అనే సందిగ్ధంలో ఉంటారు. ఒక బియ్యం నిజంగా మరొకదాని కంటే మంచిదా లేదా అది కేవలం అపోహ మాత్రమే. పోషకాహార నిపుణుడు భువన్ రస్తోగి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో బ్రౌన్ రైస్‌కు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు మరియు రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పారు.

పోషకాహార నిపుణుడు భువన్ తన పోస్ట్‌లో ఇలా వివరించాడు. ‘వైట్ రైస్ పాలిష్ చేయడానికి ముందు గోధుమ రంగులో ఉంటుంది. పాలిష్ చేయని బియ్యాన్ని మాత్రమే బ్రౌన్ రైస్‌‌గా విక్రయిస్తున్నారు. తెల్ల బియ్యం ప్రాసెస్ చేయబడినప్పుడు బ్రౌన్ రైస్ తృణధాన్యం. వరి ధాన్యాన్ని పాలిష్ చేసినప్పుడు దాని నుండి ఊక, మొలకలలో కొంత భాగాన్ని తొలగిస్తారు. బియ్యంలో మొలకెత్తిన భాగం చాలా ఖనిజాలను కలిగి ఉంటుంది. ఊకలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పాలిష్ చేసిన తర్వాత తెల్ల బియ్యం నుండి ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు తొలగించబడతాయి.

వండిన వైట్ రైస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ 70 కంటే ఎక్కువగా ఉంటుందని.. బ్రౌన్ రైస్‌లో 50 ఉంటుందని పోషకాహార నిపుణులు తెలిపారు. అంటే వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెద్దగా పెంచదు. డయాబెటిక్ పేషెంట్‌లకు ఇది మంచి ఎంపిక. చాలా మంది ఆహారంలో తెల్ల బియ్యం మాత్రమే తినడానికి ఇష్టపడతారు. దీని కారణంగా అవసరమైన మొత్తంలో ఫైబర్ శరీరానికి చేరదు. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన ఆహారంలో కేలరీలు మాత్రమే ఉంటాయి.

వైట్ రైస్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి పోషకాహార నిపుణుడు భువన్ కొన్ని కీలక విషయాలను వెల్లడించాడు.  1900ల ప్రారంభంలో బ్రౌన్ రైస్ కంటే తెల్ల బియ్యం ఎక్కువగా తినడం వల్ల బెరిబెరి వ్యాధి వ్యాప్తి చెందడం ప్రారంభమైంది. ఎందుకంటే ఈ కారణంగా ప్రజలలో విటమిన్ B1 లోపం ఏర్పడింది. ముఖ్యంగా బియ్యం ప్రధాన ఆహారంగా తీసుకునేవారు.. వారిలో వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ఆరోగ్య ధోరణి కాదు. అయితే ఇది మన మూలాల్లోకి తిరిగి వెళ్ళే మార్గం ఇక్కడ మనం తక్కువ ప్రాసెస్ చేసిన బియ్యాన్ని తింటాము.

ఇవి కూడా చదవండి: AP Movie Tickets: ఆన్‌లైన్‌లో మూవీ టికెట్ల కోసం జీవో 142 జారీ.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..