- Telugu News Photo Gallery Hemoglobin rich food these 5 foods will remove anemia and increase hemoglobin in a few days
Health Tips: శరీరంలో రక్తం పెరగాలంటే.. ఈ ఐదు ఆహార పదార్థాలను తప్పనిసరిగా తినండి..
Hemoglobin Rich Food: శరీరంలో ఐరన్ లోపంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. హిమోగ్లోబిన్ తగ్గితే (రక్తహీనత) శరీరంలో రక్తం శాతం తగ్గుతుంది. ఎలాంటి మందులు తీసుకోకుండానే.. హిమోగ్లోబిన్ లోపాన్ని అధిగమించవచ్చు. దీనికి మీరు ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకుంటే.. హిమోగ్లోబిన్ లోపం నుంచి బయటపడొచ్చు.
Updated on: Dec 19, 2021 | 5:16 PM

బచ్చలికూర - పోషకాల నిధి బచ్చలికూర.. బచ్చలికూరలో ఆరోగ్యానికి చాలా మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి. దీనిలో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. దీంతోపాటు అధిక మొత్తంలో విటమిన్ ఎ, సి, ఇ,, బి కాంప్లెక్స్ ఉన్నాయి. ఇది కాకుండా, మాంగనీస్, కెరోటిన్, అయోడిన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఫాస్పరస్ ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, బచ్చలికూర కండరాల పెరుగుదలకు కూడా చాలా మంచిది.

ఉసిరి - ఉసిరిలో విటమిన్ సి, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఉసిరిని సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. మీరు ఆమ్లా ఊరగాయ, మిఠాయి లేదా మురబ్బా వంటి వంటకాలను చేసుకొని ఇష్టంగా తినవచ్చు.

ఎండుద్రాక్ష - ఎండిన పండ్లలో చాలా వరకు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఎండుద్రాక్షలో రాగి, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఎనిమిది నుంచి పది ఎండు ద్రాక్షలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు తినడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇవి జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా.. ఉదర సమస్యలను దూరం చేస్తాయి.

అలిచెంత గింజలు- అలసందలు (బ్లాక్ ఐడ్ పీస్) లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన 26-29% ఐరన్ ను పుష్కలంగా అందిస్తాయి. అందువల్ల మీరు వీటిని క్రమం తప్పకుండా తింటే చాలా మంచిది. హిమోగ్లోబిన్ లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను అధిగమించడానికి ఇవి సహాయపడతాయి.

బెల్లం - మీరు చక్కెరకు బదులుగా బెల్లంను తింటే చాలా మంచిది. ఇది పంచదారకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మీకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే.. మీరు బెల్లం తింటే.. పెరుగుతుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.





























