World Snakes: ప్రపంచ వ్యాప్తంగా టాప్-9 విషపూరితమైన, శక్తివంతమైన పాములు ఇవే..!
World Snakes: పాము.. దీనిని చూస్తే వెన్నెలో వణుకుపుడుతుంది. పాము కనిపిస్తే దానికన్న ముందే భయంతో పరుగులు తీస్తుంటాము. ఎక్కడ కాటేస్తుందోననే టెన్షన్ పడుతుంటాము. ప్రపంచ ..
Updated on: Dec 20, 2021 | 12:05 PM

కింగ్ కోబ్రా: ఈ కింగ్ కోబ్రా పాము 13 అడుగులు ఉంటుంది. దీని బరువు దాదాపు 20 పౌండ్లు. అంటే దాదాపు 9 కిలోల వరకు ఉంటుంది. కింగ్ కోబ్రా ప్రపంచంలోని అతి పెద్ద పాములలో ఇది ఒకటి. అంతేకాదు భూమిపై అతి పొడవైన పాము కూడా. ఈ విషపూరిత పాముకు అనేక ప్రత్యేకతలున్నాయి. కింగ్ కోబ్రా ఎక్కువ భారతదేశం, ఆగ్నేయాసియా, దట్టమైన అడవుల్లో కనిస్తుంది. ఈ పాముకు ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే ముందుగానే అప్రమత్తం అవుతుంటుంది. అందుకు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుంది. అంతేకాకుండా తన సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటుంది. పైకి లేచి నిలబడి పోరాడేందుకు సిద్దమవుతుంటుంది.

బోవా కన్‌స్ట్రిక్టర్ పాము: కింగ్ కోబ్రా వలె బోయా కన్‌స్ట్రిక్టర్ పాము 13 అడుగుల వరకు ఉంటుంది. దీని బరువు 60 పౌండ్లు. ఈ పాము పుట్టినప్పుడు రెండు అడుగుల పొడవు మాత్రమే ఉంటుంది. ఈ పాములు పర్వత ప్రాంతాల్లో, దక్షిణ అమెరికాలో ఎక్కువ కనిపిస్తుంటాయి.

బ్లాక్ మాంబా: బ్లాక్ మాంబా అనే పాము ఎక్కువగా ఆఫ్రికన్ అడవుల్లో కనిపిస్తుంటాయి. ఈ పాము సన్నగా ఉంటుంది. ఈ పాములు దాదాపు 14 అడుగుల వరకు పెరుగుతాయి. ఇది చాలా విషపూరితమైనవి. ఇవి పశ్చిమ ఆఫ్రికన్‌లోని గడ్డి భూముల్లో కూడా కనిస్తాయి. ఈ పాముకు సన్నని శరీరం ఉంటుంది. దీని బరువు 3 పౌండ్లు. ఈ పాము గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

ఆఫ్రికన్ రాక్ ఫైథాన్: ఆఫ్రికన్ రాక్ ఫైథాన్ పాము ఎక్కువగా ఆఫ్రికాలోని గడ్డి భూముల్లో నిపిస్తుంటుంది. దీని పొడవు 16 అడుగులు. దీని బరువు దాదాపు 250 పౌండ్ల వరకు ఉంటుంది. ఈ పాముకు శక్తివంతమైన కండరాలు కలిగి ఉంటుంది. ఈ పాము నల్ల ఎలుగుబండ్లు, చిరుతలు, అడవి పంది, ఇతర పెద్ద జీవులనే తినేందుకు ప్రయత్నిస్తుంటుంది.

ఇండియన్ పైథాన్: ఇండియన్ పైథాన్ అనే పాము అధికంగా ఇండియా, నేపాల్, శ్రీలంక ఆడవుల్లో కనిపిస్తుంటుంది. దీని బరువు 150 పౌండ్లు. ఈ పాము 20 అడుగుల పొడవు వరకు ఉంటుంది. పాము చిన్న క్షీరదాలు, పక్షులను తింటుంది. ఇతర పాముల్లాగే వేటాడేందుకు బలమైన కండరాలు కలిగి ఉంటుంది. ఈ పాము చర్మం కోసం చాలా మంది వేటాడుతుంటారు. అలాగే ఈ పాములన తినేవారు చాలా మంది ఉంటారు.

బర్మీస్ పైథాన్: ఈ పాము దాదాపు 23 అడుగుల పొడవు ఉంటుంది. దీని బరువు 200 పౌండ్లు. ఈ పాము ఎక్కువగా చైనాతో సహా ఆగ్నేయాసియాలోని చిత్తడి నేలల్లో నివసిస్తుంటుంది. ఈ పాము చర్మం ఎంతో మందంగా ఉంటుంది. దీనిపై ఎవరైనా దాడి చేస్తే ఊపిరాడకుండా చుట్టేస్తే సామర్థ్యం ఉంటుంది. ఈ పాముల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది.

అమెథిస్టిన్ పైథాన్: ఈ పాము సుమారు 27 అడుగుల పొడవు ఉంటుంది. బరువు 33 సౌండ్లు. ప్రధానంగా ఇండోనేషియా, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాలలో నివసిస్తుంటుంది. దీని నివాస స్థలం ఉష్ణమండల అడవులు, గడ్డి భూములు, పొదలలో ఉంటుంది. ఈ పాము పెద్ద సంఖ్యలో ఉండటంతో అంతరించిపోయే ప్రమాదమేమి లేదు.

రెటిక్యులేటెడ్ పైథాన్: రెటిక్యులేటెడ్ పైథాన్ .. దీని పొడవు 29 అడుగులు. దీని బరువు 595 పౌండ్ల వరకు ఉంటుంది. ఈ అతిపెద్ద పాము శరీరం పసుపు రంగు, గోధుమ రంగుల్లో ఉంటుంది. దీని శరీరంపై ఈ రంగు చారలు ఉంటాయి. ఈ ఆడ పాము మగ పాములకంటే పెద్దగా ఉంటాయి. తూర్పు, పశ్చిమ ఆసియా, బంగ్లాదేశ్, వియత్నాంలో కనిపిస్తుంటాయి.

ఆకుపచ్చ ఏనుగు: ఈ ఆకుపచ్చ ఏనుగు (యూనెక్టెస్ మురినస్) పాము దాదాపు 30 అడుగుల వరకు పొడవు ఉంటుంది. దీని బరువు 250 కిలోలు వరకు ఉంటుంది. ఈ పాము స్కూలు బస్సుకు సమైనమైన పొడవు కలిగి ఉంటుంది. సాధారణంగా ఈ పాము బ్రెజిల్, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లోని బురదలో కనిపిస్తాయి. ఈ పాములు ప్రధానంగా అడవి పంది, జింకలను వేటాడుతుంటుంది. ఏ జంతువును వేటాడినా అది చనిపోయే వరకు దానిని చుట్టేస్తుంటుంది.





























