Omicron Variant: యూకే నుంచి వచ్చిన మరో ఇద్దరికి ఒమిక్రాన్.. దేశంలో మొత్తం ఎన్ని కేసులున్నాయంటే?
Omicron variant India Update: దేశంలో కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా గుజరాత్‌లో ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధారణ
Omicron variant India Update: దేశంలో కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా గుజరాత్‌లో ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 145 కు పెరిగింది. బ్రిటన్నుంచి ఆదివారం గుజరాత్‌కు వచ్చిన ఓ వ్యక్తి (45)కి ఒమిక్రాన్ వేరియంట్సోకినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అతన్ని విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు డాక్టర్ చారి వివరించారు. ఆయనతోపాటు యూకే నుంచి గాంధీనగర్‌కు వచ్చిన 15 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారిద్దరు క్షేమంగానే ఉన్నారని.. వారి వెంట ఉన్నవారెవరికీ కరోనా సోకలేదని అధికారులు వెల్లడించారు. కుటుంబసభ్యులను ట్రేస్ చేసి.. క్వారంటైన్లో ఉంచినట్లు తెలిపారు.
గణాంకాల ప్రకారం.. దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 48 కేసులు నమోదవగా.. ఢిల్లీలో 22, తెలంగాణలో 20, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 14, కేరళలో 11, గుజరాత్‌లో 9, ఆంధ్రప్రదేశ్, చంఢీగఢ్, తమిళనాడు, బెంగాల్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ సోకిన 48 మందిలో 28 మంది ఇప్పటికే కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
దేశంలో 83,913 యాక్టివ్ కరోనా కేసులు భారతదేశంలో గత 24 గంటల్లో 7,081 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు 264 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,77,422కి చేరింది. నిన్న 7,469 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవరీల సంఖ్య 3,41,78,940కి చేరుకుంది. దేశంలో 83,913 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: