Banana Peel: తొక్కే కదా అని పడేస్తున్నారా? అరటి తొక్క ప్రయోజనాలు ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
Banana Peel: అరటిపండుతో పాటు దాని తొక్క కూడా ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని మీకు తెలుసా. సాధారణంగా ప్రతీ ఒక్కరు అరటి పండును తింటారు.

Banana Peel: అరటిపండుతో పాటు దాని తొక్క కూడా ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని మీకు తెలుసా. సాధారణంగా ప్రతీ ఒక్కరు అరటి పండును తింటారు. దాని తొక్కను మాత్రం పడేస్తారు. అయితే, అరటి తొక్క వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. అరటిపండును ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. ఇందులో ఉండే విటమిన్లు, పొటాషియం శరీరానికి చాలా అవసరం.. కావున ప్రతీరోజూ ఒక అరటి పండును తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే అరటిపండుతో పాటు దాని తొక్క కూడా ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని మీకు తెలుసా? అందరూ అరటిపండు తింటారు కానీ, దాని తొక్కను విసిరివేస్తారు. కారణం దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఎవరికి తెలియదు కాబట్టి. అరటి తొక్కలో విటమిన్లు B6, B12 ఉంటాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే.. అరటి పండును తిన్న తరువాత.. అరటి తొక్కను పడేసి ముందు ఒకసారి ఆలోచించండి. ఇక అరటి తొక్క ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. రోగనిరోధక శక్తికి అత్యంత ముఖ్యమైనది విటమన్. ఈ విటమిన్లు అరటి తొక్కలో పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఎ అరటి తొక్కలో పుష్కలంగా లభిస్తుంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇన్ఫెక్షన్‌లతో పోరాడడంలో సహాయపడుతుంది. కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సంబంధించిన ప్రతిదాన్ని తీసుకోవడం అవసరం. అటువంటి పరిస్థితిలో, అరటి తొక్క సహాయం తీసుకోవడం కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి.. దంతాలను శుభ్రం చేయడానికి కూడా అరటి తొక్కను ఉపయోగించడం మంచిది. దంతాలు పసుపు రంగులోకి మారినప్పుడల్లా, వాటిని తెల్లగా మార్చేందుకు అరటిపండు తొక్క సహాయపడుతుంది. అరటి తొక్క సాయంతో దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి.
అధిక బీపీని కంట్రోల్ చేస్తుంది.. అధిక బీపీతో బాధపడేవారు.. అరటిపండు తొక్కలను తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో పొటాషియం ఉండటం వల్ల హైబీపీ అదుపులో ఉంటుంది.
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే.. అరటిపండు మాత్రమే కాదు అరటి తొక్కలో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు ఫైబర్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అరటి పండు తొక్కను తినడం ద్వారా శరీరానికి పీచు పదార్థం అందుతుంది.
ఎముకల బలంగా ఉంటాయి.. ఎముకలకు అవసరమైన కాల్షియం అరటిపండు, దాని తొక్కలో పుష్కలంగా ఉంటుంది. వింటర్ సీజన్‌లో ఎముకలకు సంబంధించిన సమస్యలు తరచుగా ఇబ్బంది పెడతాయి. ఇలాంటి సందర్భాల్లో అరటిపండు, దాని తొక్క తినడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.
చర్మానికి మేలు చేస్తుంది.. ముఖంపై మొటిమలు వేధిస్తున్నట్లయితే అరటి తొక్క అద్భుతంగా పని చేస్తుంది. అరటి తొక్కను ముఖంపై రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. రోజూ ఇలా చేయడం ద్వారా మంచి ప్రయోజం ఉంటుంది. చర్మం నిగనిగలాడుతుంది.
Also read: