Amazing Video: ఈ యువకుడికి ప్రపంచం సెల్యూట్ చేస్తోంది.. ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టన్నింగ్ వీడియో..

లక్ష్యం సాధించే అన్ని అర్హతలు ఉన్నా.. శక్తి సామార్థ్యాలు ఉన్నా.. చేసే పనిపై చిత్తశుద్ధి లేకపోవడం వల్ల అపజయాలను చవిచూస్తుంటారు. మరికొందరు తమ శారీరక వైకల్యాలను కూడా జయించి.. పది మందికి ఆదర్శంగా..

Amazing Video: ఈ యువకుడికి ప్రపంచం సెల్యూట్ చేస్తోంది.. ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టన్నింగ్ వీడియో..
Amazing Video
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 19, 2021 | 5:12 PM

జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఎత్తుపల్లాలు.. అటుపోట్లు అపజయాలే అసలైన విజయానికి మెట్లు అని చెప్పక తప్పదు. సమాజంలో ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో ఏదో సాధించాలనే తపన ఉంటేనే విజయం వైపు ఆశతో ముందుకు సాగుతుంటాడు. మనం సాదించాలనుకునే లక్ష్యం అందుకోవడానికి మన శక్తి సామర్థ్యాలు సరిపోకపోవచ్చు. అయితే మనం ఎంచుకున్న టార్గెట్ ఖచ్చితంగా చేరుకోవాలి. ఇలాంటి లక్షాలను ఎంచుకున్న తర్వాత ఎదురయ్యే కష్ట, నష్టాలను తట్టుకునే మానశిక స్థైర్యం, అంతకుమించిన ధైర్యం ఉండాలి. లక్ష్య సాధనలో ఉద్యోగమైన , వ్యాపారమైనా, రాజకీయమైనా ఏదైనా సరే వ్యక్తిగా మనకున్న మానశిక, శారీరక శక్తి సామార్థ్యాలను అందుకు తగ్గట్లుగా మార్చుకోవాలి. దృడ చిత్తం లేకుండా గుడ్డిగా లక్ష్యం వైపు అడుగులు వేస్తే విజయానికి సమీపంలోకి కూడా చేరుకోలేరు. కొంతమందికి లక్ష్యం సాధించే అన్ని అర్హతలు ఉన్నా.. శక్తి సామార్థ్యాలు ఉన్నా.. చేసే పనిపై చిత్తశుద్ధి లేకపోవడం వల్ల అపజయాలను చవిచూస్తుంటారు. మరికొందరు తమ శారీరక వైకల్యాలను కూడా జయించి.. పది మందికి ఆదర్శంగా.. స్ఫూర్తివంతా నిలుస్తుంటారు. ఇదే నిజమైన విజయం.. ఇలాంటి ఓ ఘటనే తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో సందడి చేసి కొన్ని వీడియో రకరకాలుగా ఉంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరికొన్ని ఆదర్శంగా నిలుస్తుంటాయి. ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాద్యామాల్లో తెగ షేర్ అవుతోంది.  అలాంటి ఒక వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసి మీరు బహుశా భావోద్వేగానికి లోనవుతారు.. ఆయన ధైర్యాన్ని కూడా అభినందిస్తారు.

ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ యువకుడు వేగంగా సైకిల్ తొక్కుతూ కనిపిస్తుంటాడు. అయితే అతనికి ఒకే ఒక్క కాలు ఉంటుంది.. అయినప్పటికీ అతను ఓ కర్ర సహాయంతో సైకిల్ తొక్కడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాదు ఎంతో స్ఫూర్తినిస్తోంది. అన్ని ఉన్నా ఏం చేయలేక.. ఎవరో ఏదో చేస్తారని ఆలోచించేవారికి ఇతను ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఈ అద్భుతమైన వీడియో భారీగా షేర్ అవుతోంది. ఈ వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు పెద్ద ప్రశసల జల్లు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: AP Movie Tickets: ఆన్‌లైన్‌లో మూవీ టికెట్ల కోసం జీవో 142 జారీ.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..

Brown Rice Benefits: డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్ ఎందుకు తినాలో తెలుసా.. సరికొత్త పరిశోధనల్లో తేలింది ఇదే..