Covid Vaccination: వ్యాక్సినేషన్‌లో అండమాన్‌-నికోబార్‌ సరికొత్త రికార్డ్‌.. పూర్తి వివరాలివే..

Covid Vaccination: వేవ్‌లు, వేరియంట్లతో దడ పుట్టిస్తోంది మహమ్మారి కరోనా. దీని కట్టడికి ఏకైక మార్గం టీకాలే అని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు.

Covid Vaccination: వ్యాక్సినేషన్‌లో అండమాన్‌-నికోబార్‌ సరికొత్త రికార్డ్‌.. పూర్తి వివరాలివే..
Vaccination
Follow us

|

Updated on: Dec 20, 2021 | 9:36 AM

Covid Vaccination: వేవ్‌లు, వేరియంట్లతో దడ పుట్టిస్తోంది మహమ్మారి కరోనా. దీని కట్టడికి ఏకైక మార్గం టీకాలే అని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీకాల పంపిణీలో రికార్డ్‌ సృష్టించాయి అండమాన్‌-నికోబార్ దీవులు. ప్రపంచంలో రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లు కాచుకొని కూర్చున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది భారత్. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌ను వేగ‌వంతం చేశాయి. దేశంలో టీకాల పంపిణీలో కొత్త రికార్డును నెలకొల్పాయి అండమాన్-నికోబార్ దీవులు. కేంద్రపాలిత ప్రాంత‌మైన ఈ దీవుల్లో అంద‌రికీ రెండు డోసుల వ్యాక్సినేష‌న్ ఇచ్చారు ఆరోగ్య శాఖ సిబ్బంది. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లో 100 శాతం వ్యాక్సినేష‌న్ పూర్తయింద‌ని అధికారికంగా ప్రకటించారు ఆఫీసర్లు. అంద‌రికీ కోవిషీల్డ్ టీకానే అందించ‌డం మరో విశేషం. 800 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న 836 దీవుల్లో అంద‌రికీ టీకాలు వేశామ‌ని తెలిపారు అక్కడి పాలకులు.

ఈ దీవుల్లో ఎక్కువ‌గా అడ‌వులు, కొండ ప్రాంతం ఉంటుంది. ప్రతికూల వాతావ‌ర‌ణంలోనూ టీకాలు అంద‌జేసిన‌ట్టు చెప్పారు అండమాన్‌-నికోబార్ అధికారులు. టీకాల పంపిణీ శ‌ర‌వేగంగా పూర్తి చేయ‌డంలో వైద్య సిబ్బంది కృషి చేశారని కొనియాడారు పాలకులు. అర్హులందరికీ 100 శాతం రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చిన తొలి రాష్ట్రంగా రికార్డు సృష్టించింది హిమాచల్ ప్రదేశ్‌. ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో 53.87 లక్షల మందికి డిసెంబరు 5 నాటికి రెండు డోసుల టీకాలు వేశారు సిబ్బంది. హిమాచల్‌ప్రదేశ్‌, అండమాన్‌-నికోబార్‌ దీవులు ఆదర్శమని ప్రశంసిస్తోంది కేంద్రప్రభుత్వం. ఇక దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 47లక్షల 40వేల 275కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 3కోట్ల 41లక్షల 78వేల 940 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4లక్షల 77వేల 422 మంది మరణించారు. భారత్‌లో ప్రస్తుతం 83వేల 913 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

Also read:

Good Governance Week: నేడు దేశవ్యాప్తంగా సుపరిపాలన వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్రం..

Income Tax Password: ఆదాయపు పన్ను పోర్టల్‌లో పాస్‌వర్డ్‌ మర్చిపోయారా..? ఇలా చేయండి

Bigg Boss 5 Telugu Winner: సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సన్నీ.. ఏమన్నాడంటే..