Income Tax Password: ఆదాయపు పన్ను పోర్టల్‌లో పాస్‌వర్డ్‌ మర్చిపోయారా..? ఇలా చేయండి

Income Tax Password: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైల్‌ చేయడానికి గడువు దగ్గర పడుతోంది. ఆర్థిక సంవత్సరానికి..

Income Tax Password: ఆదాయపు పన్ను పోర్టల్‌లో పాస్‌వర్డ్‌ మర్చిపోయారా..? ఇలా చేయండి
Follow us
Subhash Goud

|

Updated on: Dec 20, 2021 | 7:08 AM

Income Tax Password: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైల్‌ చేయడానికి గడువు దగ్గర పడుతోంది. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ ఐటీ రిటర్న్‌ను సమర్పించేందుకు డిసెంబర్‌ 31 వరకు గడువు ఉంది. గడువు దాటిన తర్వాత రిటర్న్‌ నమోదు చేసినట్లయితే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక పన్ను రిటర్న్‌ దాఖలు చేసేవారి ఆదాయపు పన్ను పోర్టల్‌ పాస్‌వర్డ్‌ మార్చిపోతే ఇబ్బందులు పడుతుంటారు. ఆ సమయంలో ఎలాంటి టెన్షన్‌ పడకుండా పాస్‌వర్డ్‌ను రిసెట్‌ చేసుకోవచ్చు. మీరు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పోర్టల్‌ ప్రొఫైల్‌లో పాస్‌వర్డ్‌ను మార్చుకునే మార్గాలున్నాయి. ఆధార్‌తో నమోదు చేయబడిని మొబైల్‌ నెంబర్‌ ఉంటే చాలు.

ఆధార్‌ ఓటీపీ ద్వారా.. ► ముందుగా ఇ-ఫైలింగ్‌ హోమ్‌ పేజీలోకి వెళ్లి లాగిన్‌ కావాలి ► మీ ఐడీ నెంబర్‌ను నమోదు చేయాలి. ► లాగిన్‌ స్క్రీన్‌లో ఫర్‌గిట్‌ పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాలి. ► అక్కడ కనిపించే యూజర్‌ ఐడీని నమోదు చేయాలి. ► పాస్‌వర్డ్‌ రీసెట్‌ చేయడానికి ఎంపిక చేసుకోవాలి. దాంతో ఆధార్‌ ఓటీపీని ఎంచుకోవాలి. ► వెరిఫై యువర్‌ ఐడెంటిటీ పేజీలో డిక్లరేషన్‌ చెక్‌ బాక్స్‌ని ఎంచుకుని జనరేట్‌ ఓటీపీ ఆధార్‌పై క్లిక్‌ చేయాలి. ► తర్వాత మీ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. ► ఇప్పుడు కొత్త పాస్‌వర్డ్ను ఎంటర్‌ చేసి కన్ఫర్మ్‌ చేసి సబ్‌మిట్‌పైక్లిక్‌ చేయాలి.

ఓటీపీ ద్వారా ఇ-ఫైలింగ్‌ ► ఇ-ఫైలింగ్‌ హోమ్‌ పేజీలోకి వెళ్లి లాగిన్‌ కావాలి. ► మీ ఐడీని నమోదు చేసి కొనసాగించాలి. ► తర్వాత ఫర్‌గిట్‌ పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాలి. ► పాస్‌వర్డ్‌ను రీసెట్‌ చేసేందుకు ఇ-ఫైలింగ్‌లో ఓటీపీని ఎంచుకోవాలి ► మీ పుట్టిన తేదీని నమోదు చేయాలి. ► మీ రిజిస్టర్డ్‌ ఫోన్‌ నెంబర్‌కు, ఇమెయిల్‌ ఐడికి పంపిన రెండు ఓటీపీలను నమోదు చేసి వెరిఫైపై క్లిక్‌ చేయాలి. ► సెట్‌ న్యూ పాస్‌వర్డ్‌లో కొత్త పాస్‌వర్డ్‌ను నమోదు చేసి సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయాలి.

డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టిఫికేట్‌ ద్వారా.. ► ముందుగా ఇ-ఫైలింగ్‌ లాగిన్‌ కావాలి. ► ఐడీని నమోదు చేసి కొనసాగించాలి. ► అక్కడ కింది భాగంలో ఫర్‌గిట్‌ పాస్‌వర్డ్‌పై క్లిక్‌ చేయాలి. ► పాస్‌వర్డ్‌ను రీసెట్‌ చేయడానికి డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టిఫికేట్‌ను ఎంచుకోవాలి. ► సెట్‌ న్యూ పాస్‌వర్డ్‌లో కొత్త పాస్‌వర్డ్‌ను నమోదు చేసి సబ్‌మిట్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి:

ITR Filing: మీరు ఐటీఆర్‌ దాఖలు చేశారా..? గడువు ముగిసిపోతే రూ.10వేల జరిమానా: వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ

Electric Scooter: ఈ స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 120 కిలోమీటర్లు.. అదిరిపోయే ఫీచర్స్‌తో రానున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..