Debit Cards Insurance: డెబిట్‌ కార్డుపై కూడా ఇన్సూరెన్స్‌ ఉంటుందని మీకు తెలుసా..? పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Debit Cards Insurance: బ్యాంకు అకౌంట్‌ ఉన్నవారికి డెబిట్‌ కార్డు తప్పనిసరిగ్గా ఉంటుంది. కానీ డెబిట్‌ కార్డు వల్ల కొన్ని ఉపయోగాలుంటాయి. కానీ కొందరికి అలాంటి విషయాలు తెలిసి..

Debit Cards Insurance: డెబిట్‌ కార్డుపై కూడా ఇన్సూరెన్స్‌ ఉంటుందని మీకు తెలుసా..? పూర్తి వివరాలు తెలుసుకోండి..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 20, 2021 | 8:39 AM

Debit Cards Insurance: బ్యాంకు అకౌంట్‌ ఉన్నవారికి డెబిట్‌ కార్డు తప్పనిసరిగ్గా ఉంటుంది. కానీ డెబిట్‌ కార్డు వల్ల కొన్ని ఉపయోగాలుంటాయి. కానీ కొందరికి అలాంటి విషయాలు తెలిసి ఉండదు. డెబిట్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా ఉంటుంది. అది కూడా ఉచితమే. ఇన్సూరెన్స్‌ కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ఇన్సూరెన్స్‌ ఉంటుందని బ్యాంకులు కస్టమర్లకు తెలియజేయవు. అందుకే కార్డు ఉన్నవారు నామినీ లేదా వారసులు దీనిని క్లెయిమ్‌ చేయలేరు. డెబిట్‌ కార్డ్‌ లేదా ఏటీఎం కార్డులకు కాంప్లిమెంటరీ వ్యక్తిగత ప్రమాద బీమా సదుపాయాన్ని ఆటోమేటిక్‌గా బ్యాంక్‌లు ఆఫర్‌ చేస్తాయి. ఖాతాదారులు డెబిట్‌ కార్డుపై బీమా పాలసీలను ఆఫర్‌ చేస్తున్నాయో లేదో బ్యాంకుల ద్వారా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు ఆఫర్‌ చేసే వివిధ రకాల డెబిట్‌ కార్డులపై రూ. లక్ష నుంచి రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా ఉంటుంది. ప్రమాదం కారణంగా కస్టమర్‌ చనిపోతే ఈ బీమా ప్రయోజనం ఖాతాదారుని నామినీ లేదా వారసులకు వర్తిస్తుంది.

రూపే డెబిట్‌ కార్డ్‌లపై కూడా బీమా సదుపాయం.. ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన (PMJDY)లో భాగంగా అకౌంట్‌ తెరిచిన జన్‌ధన్‌ అకౌంట్ల రూపే డెబిట్‌ కార్డులపై కూడా ఈ ఇన్సూరెన్స్‌ అమలు అవుతోంది. 2018 ఆగస్టు 28కి ముందు జారీ అయిన రూపే కార్డులపై రూ.లక్ష, ఆ తర్వాత జారీ అయిన కార్డులపై రూ.2 లక్షల ప్రమాద బీమా ఉంటుంది.

అయితే ప్రమాద మరణానికి ముందు 90 రోజుల్లో ఖాతాదారుడు డెబిట్‌ కార్డు ద్వారా ఒక్క లావాదేవి అయిన చేసి ఉంటేనే ఈ ఉచిత ప్రమాద బీమా వర్తిస్తుంది. అలాగే ఖాతాదారుడు మరణించిన తర్వాత నామినీ ప్రమాదం జరిగిన తేదీ నుంచి 90 రోజుల్లోగా బ్యాంకుకు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇచ్చిన సమాచారం 60 రోజుల్లోగా క్లెయిమ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాలి. అప్పుడే ఈ ఇన్సూరెన్స్‌ ప్రయోజనం నామినీకి అందుతుంది.

ఇవి కూడా చదవండి:

Income Tax Password: ఆదాయపు పన్ను పోర్టల్‌లో పాస్‌వర్డ్‌ మర్చిపోయారా..? ఇలా చేయండి

ITR Filing: మీరు ఐటీఆర్‌ దాఖలు చేశారా..? గడువు ముగిసిపోతే రూ.10వేల జరిమానా: వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ

ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్