Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ఆరంభంలోనే మదుపరులకు చుక్కలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల కారణంగా సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 1.50 శాతానికి పైగా పతనాన్ని చూశాయి.

Share Market: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ఆరంభంలోనే మదుపరులకు చుక్కలు..
Sensex Fall
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 20, 2021 | 10:50 AM

Share Market down: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల కారణంగా సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 1.50 శాతానికి పైగా పతనాన్ని చూశాయి. ఉదయం 9.32 సమయంలో సెన్సెక్స్‌ 1070 పాయింట్లు కుంగి 55,940 వద్ద, నిఫ్టీ 327 పాయింట్ల నష్టంతో 16,657 వద్ద ట్రేడవుతున్నాయి. బీఎస్‌ఈలో అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉండటంతో మదుపరులకు చుక్కలు కనిపించాయి. అత్యధికంగా రియాల్టీ రంగం 3.45శాతం, లోహ రంగం 3.10శాతం నష్టపోయాయి.

బ్యాంక్, ఆటో, ఐటీ, మెటల్, రియాల్టీ సహా అన్ని రంగాల పతనం కారణంగా ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1150 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 16,700 దిగువకు పడిపోయింది. హెవీ వెయిట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బలహీనత కారణంగా మార్కెట్ ఒత్తిడిలో ఉంది. స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్కసారిగా రూ.6 లక్షల కోట్లకు పైగా పడిపోయింది.

అయితే ఇంత ఒత్తిడిలో కూడా కొన్ని షేర్లు లాభాలతో కొనసాగుతున్నాయి. ఇలా లాభాలతో కొనసాగుతున్న షేర్లు ఇలా ఉన్నాయి.. ఇక నష్టాలను ముటగట్టుకుని ముందుకు నెమ్మదిగా కదులుతున్నవాటిలో.. ఫ్యూచర్‌ రిటైల్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌, అపార్‌ ఇండస్ట్రీస్‌, సిప్లా సంస్థల షేర్లు ఉన్నాయి. ఉషా మార్టిన్‌, త్రివేణి ఇంజినీరింగ్‌ ఇండస్ట్రీస్‌, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, అరవింద్‌ ఫ్యాషన్స్‌, జిందాల్‌ పోలి ఫిల్మ్స్‌ ఉన్నాయి.

శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. ఆసియా ప్రధాన మార్కెట్లు కూడా నేడు నష్టాల్లోనే ట్రేడింగ్‌ ప్రారంభించాయి.

ఇవి కూడా చదవండి: Afghanistan Heroin: కాబూల్‌ వీధుల్లో యధేశ్చగా మెథామ్‌ విక్రయం.. సంక్షోభం నుంచి బయటపడేందుకు తాలిబన్ల నయా ప్లాన్..

Adimulapu Suresh: గండి పూడ్చకుంటే నేనే చెరువులో దూకుతా.. అధికారులకు ఏపీ మంత్రి స్ట్రాంగ్‌ వార్నింగ్‌