Zero Balance Saving Account: ఏయే బ్యాంకులో జీరో బ్యాలెన్స్‌ ఖాతా తీయవచ్చు.. ఎలాంటి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి..!

Zero Balance Saving Account: దేశంలో వివిధ బ్యాంకులు జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీని అందిస్తుంటాయి. జీరో అకౌంట్లకు కనీస బ్యాలెన్స్‌ను ఉంచాల్సిన అవసరం..

Zero Balance Saving Account: ఏయే బ్యాంకులో జీరో బ్యాలెన్స్‌ ఖాతా తీయవచ్చు.. ఎలాంటి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి..!
Follow us

|

Updated on: Dec 20, 2021 | 10:38 AM

Zero Balance Saving Account: దేశంలో వివిధ బ్యాంకులు జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీని అందిస్తుంటాయి. జీరో అకౌంట్లకు కనీస బ్యాలెన్స్‌ను ఉంచాల్సిన అవసరం ఉండదు. ఈ జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లపై మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేకున్నా బ్యాంకులు ఎలాంటి పెనాల్టీలు విధించవు. పెద్దగా ఆదాయం లేని కుటుంబాలకు ఈ జీరో అకౌంట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ ఖాతాలో జరిమానా గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే జీరో సేవింగ్స్‌ ఖాతాలపై ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసుకుందాం.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌: జీరో బ్యాలెన్స్‌ సేవింగ్ ఖాతాపై ఈ బ్యాంకు 4 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. ఏటీఎం నుంచి రోజువారీ విత్‌డ్రా రూ.40,000 వరకు తీసుకోవచ్చు. అలాగే ఈ ఖాతాను ఇతర బ్యాంకుల్లో పొదుపు ఖాతాలేని వ్యక్తులు తెరవవచ్చు. ఈ అకౌంట్‌ కలిగిన వారికి రూ.2 లోల ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) బేసిక్‌ సేవింగ్స్‌ డిపాజిట్‌ ఖాతా. ఈ అకౌంట్లకు వడ్డీ రేటు 2.70. ఇందులో కనీస బ్యాలెన్స్‌ పరిమితి లేదు. ఈ బ్యాంకులో జీరో అకౌంట్‌ ఎవరైనా తీయవచ్చు. ఈ ఖాతా కోసం రూపే డెబిట్‌/ఏటీఎం కార్డు ఇవ్వబడుతుంది.

యస్‌ బ్యాంకు: ఈ బ్యాంకులో జీరో సేవింగ్స్‌ ఖాతా పేరు స్మార్ట్‌ శాలరీ అడ్వాంటేజ్‌ ఖాతా. ఈ అకౌంట్‌ బ్యాలెన్స్‌కు 4 శాతం వడ్డీ అందిస్తుంది. అయితే నెలనెల వేతనం వచ్చే ఉద్యోగులు మాత్రమే ఈ జీరో అకౌంట్‌ను తీసేందుకు అర్హులు. ఈ ఖాతా డెబిట్‌ కార్డుతో రూ.75వేల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు: జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ ఖాతా పేరు ప్రాథమిక సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్‌ అకౌంట్‌. అకౌంట్‌ డిపాజిట్‌ బ్యాలెన్స్‌కు 3 శాతం వడ్డీ పొందవచ్చు. ఉద్యోగులు మాత్రమే ఈ జీరో అకౌంట్‌ తీసుకునేందుకు అర్హులు.

కోటక్‌ మహీంద్రా బ్యాంకు: ఈ బ్యాంకులో జీరో అకౌంట్‌ పేరు 811 డిజిటల్‌ బ్యాంకు ఖాతా. ఇందులో 3 శాతం వడ్డీ పొందవచ్చు. ఈ బ్యాంకులో ఖాతా తీయంటే వీడియో కాలింగ్‌ ద్వారా కేవైసీ ఉపయోగించి ఖాతా తీసుకోవచ్చు. ఇందులో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉండాల్సిన అవసరం లేదు.

ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు: ఈ బ్యాంకులో ఇండస్‌ ఆన్‌లైన్‌ సేవింగ్స్‌ ఖాతా తీసుకోవచ్చు. దీనికి 4 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఖాతాదారులకు వ్యక్తిగత ప్రమాద బీమా రూ.2 లక్షల వరకు అందిస్తోంది. ఈ ఖాతాకు ప్లాటీనం ప్లస్‌ డెబిట్‌ కార్డు అందిస్తారు.

ఇవి కూడా చదవండి:

Debit Cards Insurance: డెబిట్‌ కార్డుపై కూడా ఇన్సూరెన్స్‌ ఉంటుందని మీకు తెలుసా..? పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Income Tax Password: ఆదాయపు పన్ను పోర్టల్‌లో పాస్‌వర్డ్‌ మర్చిపోయారా..? ఇలా చేయండి