SBI Credit Cards: ఎస్‌బీఐ నుంచి కొత్త క్రెడిట్‌ కార్డు.. వెల్‌కమ్‌ గిఫ్ట్‌ కింద స్మార్ట్‌వాచ్‌..!

SBI Credit Cards: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) కొత్త క్రెడిట్‌ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫిట్‌నెస్‌ కోసం ప్రత్యేకంగా ఎస్‌బీఐ కార్డ్‌ పల్స్‌ పేరుతో ఈ క్రెడిట్‌..

SBI Credit Cards: ఎస్‌బీఐ నుంచి కొత్త క్రెడిట్‌ కార్డు.. వెల్‌కమ్‌ గిఫ్ట్‌ కింద స్మార్ట్‌వాచ్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 20, 2021 | 1:13 PM

SBI Credit Cards: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) కొత్త క్రెడిట్‌ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫిట్‌నెస్‌ కోసం ప్రత్యేకంగా ఎస్‌బీఐ కార్డ్‌ పల్స్‌ పేరుతో ఈ క్రెడిట్‌ కార్డును ప్రారంభించింది. అయితే ఫిట్‌నెస్‌, ఆరోగ్య సంబంధిత బెనిఫిట్‌ కోసం ఈ క్రెడిట్‌ కార్డు ఉపయోగపడనుంది. వీసా సిగ్నేచర్‌ ప్లాట్ ఫాంలో ఈ ఫిట్‌నెస్‌ క్రెడిట్‌ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కాంటాక్ట్‌లెస్‌ కార్డ్‌ వార్షిక సభ్యత్వ ఫీజు రూ.1,499 ఉంది. ఈ క్రెడిట్‌ కార్డుపై ఏడాది లోపు రూ.2 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక రెన్యువల్‌ ఫీజును రద్దు చేస్తారు. ఈ కార్డు తీసుకున్న వారికి ప్రవేశ ఫీజు చెల్లింపుపై వెల్‌కమ్‌ గిఫ్ట్‌ కింద రూ.4,999 విలువైన నాయిస్‌ కలర్ ఫిట్‌ పల్స్‌ స్మార్ట్‌వాచ్‌ను ఆఫర్‌ చేస్తోంది బ్యాంకు.

ఈ కార్డు ఫీచర్స్‌లో ఫిట్‌పాస్‌ ప్రోలో ఒక సంవత్సరం కాంప్లిమెంటరీ సభ్యత్వం, ఫిట్‌పాస్‌ఖ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.4వేలకుపైగా జిమ్‌లు, ఫిట్‌నెస్‌ కేంద్రాల్లో యాక్సెస్‌ లభిస్తుంది. గరిష్టంగా 12 సెషన్స్‌ అంటే వారానికి మూడు, రోజుకు ఒక సెషన్‌ వరకు అనుమతి ఉంటుంది. ఫిట్‌కోచ్‌, ఫిట్‌ఫీస్ట్‌ సభ్యత్వం, ఫిట్‌పాస్‌ మొబైల్‌ అప్లికేషన్‌లో రోజువారీ ఫిట్‌నెస్‌ కోచింగ్‌, పోషకాహార నిపుణులు అందుబాటులో ఉంటారు. సంవత్సరం పాటు నెట్‌మెడ్స్‌ ఫస్ట్‌ సభ్యత్వం లభిస్తుంది. ఏడాది పాటు ఆన్‌లైన్‌లో వైద్యులను ఎన్ని సార్లయినా సంప్రదించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి ప్రీపెయిడ్‌పై 2.5 శాతం, ఎన్‌ఎంఎస్‌ నగదు, ఫాథాలజీ ల్యాబ్‌ పరీక్షలపై అదనంగా 5 శాతం వరకు ప్రయోజనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Zero Balance Saving Account: ఏయే బ్యాంకులో జీరో బ్యాలెన్స్‌ ఖాతా తీయవచ్చు.. ఎలాంటి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి..!

Debit Cards Insurance: డెబిట్‌ కార్డుపై కూడా ఇన్సూరెన్స్‌ ఉంటుందని మీకు తెలుసా..? పూర్తి వివరాలు తెలుసుకోండి..!