AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Heroin: కాబూల్‌ వీధుల్లో యధేశ్చగా మెథామ్‌ విక్రయం.. సంక్షోభం నుంచి బయటపడేందుకు తాలిబన్ల నయా ప్లాన్..

తాలిబన్లు ఇల్లీగల్‌ బిజినెస్‌ను ప్రోత్సహిస్తున్నారు. పైకి నిషేధం ప్రకటించినా, గుట్టుగా మాదకద్రవ్యాల వ్యాపారం జోరుగా సాగుతోంది.

Afghanistan Heroin: కాబూల్‌ వీధుల్లో యధేశ్చగా మెథామ్‌ విక్రయం.. సంక్షోభం నుంచి బయటపడేందుకు తాలిబన్ల నయా ప్లాన్..
Heroin, Opiumtaliban
Sanjay Kasula
|

Updated on: Dec 20, 2021 | 6:57 AM

Share

తాలిబన్లపై అంతర్జాతీయంగా అంతమంచి పేరు ఏం లేదు. కానీ అక్కడ ఉన్న దుర్భర పరిస్థితులు అనేక దేశాలను కదిలిస్తున్నాయి. తాజాగా భారత్‌ కోట్ల రూపాయలు విలువ చేసే మెడిసిన్‌ ఆఫ్ఘనిస్తాన్‌కు పంపింది. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనేక దేశాలు వారికోసం సాయం చేస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం ముదిరిన వేళ, తాలిబన్లు ఇల్లీగల్‌ బిజినెస్‌ను ప్రోత్సహిస్తున్నారు. పైకి నిషేధం ప్రకటించినా, గుట్టుగా మాదకద్రవ్యాల వ్యాపారం జోరుగా సాగుతోంది. అక్కడ సాగు చేసే ఓ మత్తు పధార్థానికి కోట్లలో విలువ ఉంటుంది.

దాని సాగుకే మొగ్గుచూపుతున్నారు అక్కడి రైతులు. ముఖ్యంగా దక్షిణ అఫ్గానిస్తాన్‌లో నాణ్యమైన మెథామ్‌ ఫెటామిన్‌ను స్మగ్లింగ్‌ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని ఆస్ట్రేలియా లాంటి దేశాలకు స్మగ్లింగ్ చేస్తారు అఫ్ఘాన్‌ ప్రజలు. వంద కిలోల మెథ్‌కు దాదాపు 20 కోట్లు వస్తాయని చెబుతున్నారు. దీనికి అంత డిమాండ్‌ ఉంది. గతంలోనే అఫ్గానిస్తాన్‌లో డ్రగ్స్ వ్యాపారం విస్తరించింది.

తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక, అది మరింత వేగంగా పెరిగింది. అఫ్గానిస్తాన్‌కు చాలా కాలం నుంచీ హెరాయిన్ ఉత్పత్తి చేసే దేశంగా పేరుంది. కానీ ఇది గత కొన్నేళ్లుగా క్రిస్టల్ మెథ్‌కు కూడా ప్రధాన ఉత్పత్తిదారుగా ఆవిర్భవించింది. ఈ డ్రగ్‌కు సంబంధించి 500కు పైగా తాత్కాలిక ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. వీటిలో ఇప్పుడు ప్రతిరోజూ దాదాపు 30 క్వింటాళ్ల క్రిస్టల్ మెథ్ తయారవుతోంది.

ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో మెథ్ తయారు చేసే లాబ్‌లన్నీ బిజీ బిజీగా ఉన్నాయి. తాలిబాన్లు మొదట అధికారంలో ఉన్నప్పుడు దీనిపై నిషేధం విధించారు. అధికారం కోల్పోయి వారు బయటున్న సమయంలో అది వారి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. కీలక విషయం ఏంటంటే, ఇంత ఇబ్బందుల్లో ఉన్నా, అక్కడి ప్రజలు మెథ్‌కు బానిసలు మారారు. రోడ్లపైనే దీన్ని పీలుస్తూ మత్తులో తూగుతున్నారు.

ఇవి కూడా చదవండి: Byreddy Siddharth Reddy: బైరెడ్డా.. మజాకా.. సీఎంకు బర్త్ డే విషెస్ ఎలా చెప్పాడో చూడండి

Viral Video: ఎలక్ట్రిక్ ఈల్‌ను వేటాడాలనుకున్న మొసలి.. షాకింగ్.. ఊహించని విషాదాంతం..