AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Byreddy Siddharth Reddy: బైరెడ్డా.. మజాకా.. సీఎంకు బర్త్ డే విషెస్ ఎలా చెప్పాడో చూడండి

బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి.. ఏపీలో మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్న యువనేత. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో బాగా ఫేమస్ అయ్యాడు.

Byreddy Siddharth Reddy: బైరెడ్డా.. మజాకా.. సీఎంకు బర్త్ డే విషెస్ ఎలా చెప్పాడో చూడండి
Byreddy Siddhartha Reddy
Ram Naramaneni
|

Updated on: Dec 19, 2021 | 6:19 PM

Share

బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి.. ఏపీలో మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్న యువనేత. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో బాగా ఫేమస్ అయ్యాడు. సీఎం జగన్ ప్రేమ చూరగొని.. శాప్ (ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ) చైర్మన్ అయ్యాడు. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. అందుకే సిద్దార్థ్ రెడ్డి.. తన తమ్ముడి లాంటివాడు అని చెప్పిన జగన్.. అతనికి మంచి పదవి ఇచ్చారు.

ఇక డిసెంబర్ 21న ఏపీ సీఎం జగన్ బర్త్ డే. దీంతో వైసీపీ నాయకులు, శ్రేణులు ముఖ్యమంత్రి బర్త్ డే వేడుకలు గ్రాండ్‌గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వస్తున్నారు. కాగా ముఖ్యమంత్రిపై తనకున్న అభిమానాన్ని వెరైటీగా చాటుకున్నాడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. విశాఖ, రుషికొండలో స్కూబా డైవింగ్ చేసిన బైరెడ్డి, సముద్రం లోతుల్లోకి వెళ్ళి సీఎంకు ముందస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ నెల 21 న ముఖ్యమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా విజయసాయిరెడ్డి నిర్వహిస్తోన్న వైఎస్సార్ కప్ క్రికెట్ -2021 పోటీల సన్నాహాకాల కోసం విశాఖ వచ్చిన సిద్ధార్ధరెడ్డి నగరంలో పలు క్రీడా మైదానాలను సందర్శించారు.

Also Read: పోట్ల గిత్తలా మనిషిపైకి దూసుకొచ్చిన కోడి పుంజు.. చతుర్లాడితే అంతే మరి.. షాకింగ్

వివాహేతర సంబంధం బయటపెడతానని భయపెట్టి వివాహితపై బాలుడు అత్యాచారం