Viral Video: పోట్ల గిత్తలా మనిషిపైకి దూసుకొచ్చిన కోడి పుంజు.. చతుర్లాడితే అంతే మరి.. షాకింగ్

కోడి పుంజులకు పౌరుషం ఎక్కువ. పందెంలో పాము మాదిరి కస్సున లేచి.. సింహంలా ప్రత్యర్థిపై విరుచుకుపడుతుంది.

Viral Video: పోట్ల గిత్తలా మనిషిపైకి దూసుకొచ్చిన కోడి పుంజు.. చతుర్లాడితే అంతే మరి.. షాకింగ్
Cockfight With Man
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 19, 2021 | 5:40 PM

కోడి పుంజులకు పౌరుషం ఎక్కువ. పందెంలో పాము మాదిరి కస్సున లేచి.. సింహంలా ప్రత్యర్థిపై విరుచుకుపడుతుంది. బాగా బలిసిన ఆంబోతు తాడు తెంచుకుని ఊరి మీద పడితే తల విసురుతూ.. కొమ్ములతో  విధ్వంసం సృష్టిస్తుంది. అలాంటి ఆంబోతు కొమ్ములు వంచటం ఒక ధైర్య సాహసంగా చెప్పుకుంటారు. అలాంటి సన్నివేశాలున్న పాత్రల్లో మన తెలుగు అగ్రహీరోలు నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక పాములు సైతం ఒక పట్టాన చిక్కవు. దాన్ని బుట్టలో పెట్టేందుకు చాలా నైపుణ్యం, ఒడుపును ప్రదర్శిస్తారు స్నేక్ క్యాచర్స్. అయితే కోడిపుంజులు మనుషులపైకి అంతగా విరుచుకుపడవు. కాని వాటికి అహం దెబ్బతింటే కోళ్లు సైతం ఇగోతో మనిషిపైకి దూసుకువస్తాయి. పశ్చిమగోదావరి జిల్లా కలరాయనగూడెం గ్రామంలో సరిగ్గా ఇదే జరిగింది.

గ్రామంలోని పందెం కోళ్ల దొడ్డిలోకి రామకృష్ణ అనే వ్యక్తి ఒకరు వచ్చి.. యజమాని సుధాకర్ తో మాట్లడుతూ అక్కడ ఉన్న పందెంకోడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అది రెచ్చిపోయింది. పౌరుషంతో ఊగిపోతూ కాళ్లతో ఎగిరి తన్నటం మొదలు పెట్టింది. ఇప్పటి వరకు కోడి పుంజు మరో పుంజుతో కొట్లాటక దిగటం, దానిపై విరుచుకుపడి దాడి చేయటం చూసిన వాళ్లు మనిషిపైనా అది చెలరేగడం చూసి ఆశ్చర్య పోయారు. కొద్దిసేపటికి అతి కష్టం మీద పందెం కోడిని చేతపట్టుకోగలిగిన రామకృష్ణ దాన్ని గంప కింద పెట్టాడు. కాని అప్పటికే కోడి తన ముక్కుతో అతడిని గాయపరిచింది.  ఓయ్ దొంగకోళ్లు పట్టేటోళ్లు ఇక జరభద్రం..!  మీరు కాని ఆశపడి పందెం కోళ్లవైపు వెళ్లారా..? టపా కట్టేస్తారంతే మరి.

బి. రవి కుమార్, టీవీ9 తెలుగు, పశ్చిమగోదావరి జిల్లా

Also Read: బెడ్‌షీట్ చాటునుంచి కొసరి.. కొసరి చూస్తూ.. ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

 వివాహేతర సంబంధం బయటపెడతానని భయపెట్టి వివాహితపై బాలుడు అత్యాచారం