AP Liquor Rates: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్.. తగ్గించిన మద్యం ధరలు నేటి నుంచి అమలు.. ఎంత తగ్గాయంటే..!
AP Liquor Rates: మందుబాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం బాబులకు గుడ్‌న్యూస్. నిన్న మద్యం ధరలను తగ్గించనున్నట్లు..
AP Liquor Rates: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం బాబులకు గుడ్‌న్యూస్. నిన్న మద్యం ధరలను తగ్గించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. తగ్గిన ధరలను ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం మద్యం ధరలలో మార్పులు చేయడంతో మద్యం బాబులకు పండగే. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ మార్జిన్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇండియన్ మేడ్‌ఫారిన్ లిక్కర్‌పై 5 నుంచి 12 శాతం తగ్గించింది. అన్ని కేటగిరిల మద్యంపై 20 శాతం వరకు ధరలను తగ్గించనుంది ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం, నాటుసారా తయారీని అరికట్టేందుకు ధర తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మద్యం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మద్యం ధరలపై ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఆదివారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.
అలాగే ఐఎంఎల్ లిక్కర్‌పై వ్యాట్ 35 నుంచి 50 శాతం వరకు తగ్గింది. స్పెషల్ మార్జిన్ 10 నుంచి 20 శాతం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 5 నుంచి 26 శాతం వరకు తగ్గించింది ప్రభుత్వం.
ఇవి కూడా చదవండి: