AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chittoor: ఈత కొట్టేందుకు వెళ్లి.. స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు..

Students Drowned in Swarnamukhi River: ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా రేణిగుంట మండలం జి.వి.పాలెం సమీపంలోని

Chittoor: ఈత కొట్టేందుకు వెళ్లి.. స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు..
Drowned
Shaik Madar Saheb
|

Updated on: Dec 19, 2021 | 3:21 PM

Share

Students Drowned in Swarnamukhi River: ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా రేణిగుంట మండలం జి.వి.పాలెం సమీపంలోని స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. మొత్తం నలుగురు నదిలో కొట్టుకుపోగా.. ఒకరిని స్థానికులు సురక్షితంగా కాపాడారు. ఆదివారం ఉదయం నలుగురు విద్యార్థులు నదిలో ఈతకు వెళ్లారు. వారిలో జి.వి.పాలెం ఎస్సీ కాలనీకి చెందిన గణేష్ (15), యుగంధర్ (14), ధోని (16) గల్లంతు కాగా.. లిఖిత్‌ సాయి ప్రాణాలతో బయటపడ్డాడు. లిఖిత్ సాయిని అక్కడ చేపలు పడుతున్న స్థానికులు కాపాడారు. ఈ ఘటన సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. గల్లంతైన విద్యార్థుల కోసం గజ ఈతగాళ్లు, స్థానికుల సహాయంతో గాలిస్తున్నారు.

కాగా.. స్వర్ణముఖి నదిలో విద్యార్థుల గల్లంతైన విషయాన్ని తెలుసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కాగా.. ధోని రేణిగుంట శ్రీనివాస జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతుండగా. గణేష్ పాపా నాయుడు పేట జడ్పీ హైస్కూల్లో చదువుతున్నాడు.

Also Read:

Alappuzha: కేరళ అలప్పుజలో టెన్షన్.. గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నాయకుల హత్య..

AP Movie Tickets: ఆన్‌లైన్‌లో మూవీ టికెట్ల కోసం జీవో 142 జారీ.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!