AP High Court: ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర్వులు తెలుగులో ఉండేలా చూడాలని హైకోర్టులో పిటిషన్
AP High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు, ఉత్తర్వులు తెలుగులోనూ జారీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్..
AP High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు, ఉత్తర్వులు తెలుగులోనూ జారీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు కేవలం 13 శాతం మందికి అర్థమయ్యే ఆంగ్లంలో జరుగుతున్నాయన్న పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకే రాష్ట్ర అధికార భాషా చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లను తెలుగులో నిర్వహించేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అధికార భాష పర్యవేక్షణ అధికారులను నియమించేలా ఆదేశించాలని అభ్యర్తించారు. 2017లో తీసుకొచ్చిన ఏపీ పర్యాటక, సాంస్కృతిక చట్టానికి అనుగుణంగా తెలుగు భాషాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలన్న కోరారు.
సీఎస్‌తో సహా సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్య దర్శి, ఏపీ యువత అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు పిటిషనర్. అయితే ప్రజలకు అర్థం అయ్యే భాషలో దస్త్రాలు నిర్వహించకపోవడం ఇబ్బందికరంగా మారిందన్నారు. సర్కార్ పాలనకు సంబంధించిన అంశాలు, కార్యనిర్వహణ నిర్ణయాలు, జీవోలు, ప్రజా సమస్యలపై తీసుకునే ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ వివరాలన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉండేలా చూడాలని కోరారు.
ప్రభుత్వ ఆఫీసుల్లో తెలుగును అధికార భాషను వినియోగించాలని, గతంలో తీసుకువచ్చిన జీవోలను అమలు చేయాలని కోరుతూ ఈ ఏడాది మార్చి, సెప్టెంబర్ నెలల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శికి వినతి పత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు. వాటిపై ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఇప్పటికైనా ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ ఉత్తర్వులు , కార్యాలయాల అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగు భాషలోనూ జారీచేసేలా ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: