Tollywood Heroine: కొసరి.. కొసరి చూస్తూ.. ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

హీరోలను పిచ్చిగా అభిమానించే తెలుగు ఆడియెన్స్.. హీరోయిన్స్‌ కూడా మెప్పిస్తే వారికి గుండెల్లో గుడి కట్టేస్తారు. ఫేవరెట్ హీరోయిన్ కోసం కూడా థియేటర్‌కు క్యూ కట్టేస్తారు.

Tollywood Heroine:  కొసరి.. కొసరి చూస్తూ.. ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
Tollywood Actress
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 19, 2021 | 7:15 PM

హీరోలను పిచ్చిగా అభిమానించే తెలుగు ఆడియెన్స్.. హీరోయిన్స్‌ కూడా మెప్పిస్తే వారికి గుండెల్లో గుడి కట్టేస్తారు. అలనాటి శ్రీదేశి దగ్గర్నుంచి.. సౌందర్య, రమ్యక్రిష్ణ, రంభ, రాశి, త్రిష, శ్రియ, నయనతార, నిత్యామీనన్… లేటెస్ట్ ముద్దుగుమ్మలు.. సాయి పల్లవి, క్రితి శెట్టి వరకు మన ఆడియెన్స్ ఏ రేంజ్‌లో వారిని ఆరాధిస్తున్నారో చూస్తున్నాం. ఇలానే తెలుగు ప్రేక్షకులకు నచ్చిన మరో బబ్లీ హీరోయిన్ సురభి.  ‘బీరువా’ సినిమాతో తెలుగునాటు అడుగుపెట్టింది ఈ బొద్దుగుమ్మ.  తన అందం, అభినయంతో త్వరగానే మన ఆడియెన్స్‌కు దగ్గరైంది. ఆ తర్వాత.. ‘ఎక్స్ ప్రెస్ రాజా, ‘అటాక్’, ‘జెంటిల్‌మెన్’, ‘ఒక్క క్షణం’ మూవీస్‌తో మంచి పేరు సంపాదించింది. ఆఫ్‌స్క్రీన్‌లో కూడా అమ్మడు చాలా సాఫ్ట్ అని ఇండస్ట్రీ వర్గాల టాక్.  ‘కాటుకెట్టినా కళ్లను చూస్తే.. ‘ పాటు ఏ రేంజ్‌లో శ్రేతలను ఆకట్టుకుందో తెలిసిందే. విజువల్‌గా కూడా ఈ పాట చాలా బాగుంటుంది. అందులో సురభి డ్యాన్సుకు ఆమె ఫ్యాన్స్ క్లీన్ బౌల్డయ్యారు. ఇటీవల మంచు విష్ణుతో ‘ఓటర్ ‘… ఆది సాయికుమార్‌తో ‘శశి’ వంటి మూవీల్లో యాక్ట్ చేసింది సురభి. ప్రస్తుతం ఓ తమిళ సినిమా.. రెండు తెలుగు సినిమాలు అమ్మడి ఖాతాలో ఉన్నాయి. అయితే బ్యూటీ, టాలెంట్ ఉన్న సురభికి సరైన హిట్ ఒక్కటీ దక్కలేదు. ఒక్క మంచి సినిమా పడితే ఆమె టాప్ రేస్‌లోకి రావడం ఖాయం అంటున్నారు సురభి ఫ్యాన్స్.

తాజాగా నెట్టింట ఓ క్రేజీ ఫోటోను షేర్ చేసింది ఈ బ్యూటీ. బెడ్‌షీట్ చాటునుంచి కొసరి.. కొసరి చూస్తూ.. ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తుంది ఈ బ్యూటీ. దీంతో ‘నువ్ గోల్డ్ ఎహె’ అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.

Also Read: Hyderabad: వివాహేతర సంబంధం బయటపెడతానని భయపెట్టి వివాహితపై బాలుడు అత్యాచారం