Viral Video: ఎలక్ట్రిక్ ఈల్‌ను వేటాడాలనుకున్న మొసలి.. షాకింగ్.. ఊహించని విషాదాంతం..
అడవిలో జీవితాలు ఎప్పుడూ చాలా ప్రమాదంలో ఉంటాయ్. ఒక జీవికి కడపు నిండాలంటే మరో జీవికి ఆయువు మూడినట్లే. ఆకులు, కాయలు తిని బ్రతికే జంతువులు చాలా తక్కువ మాత్రమే ఉంటాయి.
అడవిలో జీవితాలు ఎప్పుడూ చాలా ప్రమాదంలో ఉంటాయ్. ఒక జీవికి కడపు నిండాలంటే మరో జీవికి ఆయువు మూడినట్లే. ఆకులు, కాయలు తిని బ్రతికే జంతువులు చాలా తక్కువ మాత్రమే ఉంటాయి. ప్రతి క్షణం అలెర్ట్‌గా ఉండకపోతే.. ఖేల్ ఖతం అయిపోయింది. జంతువులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అడవుల్లోనే గడుపుతున్నాయి. అయితే కొన్నిసార్లు వేటాడే జంతువే.. బాధితురాలిగా మారడం జరుగుతుంది. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట తెగ సర్కులేట్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు షాకవ్యవడం ఖాయం.
ఈ 2 నిమిషాల వీడియో ట్విట్టర్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. @zubinashara అనే అకౌంట్ నుంచి దీన్ని షేర్ చేశారు. ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఈ వీడియోను మళ్లీ, మళ్లీ చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగిన దాన్ని చూసి.. వారికి నమ్మకం కుదరడం లేదు. మొసలి నీటిలో ఎంత బలం ప్రదర్శిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నీటిలో దిగితే.. ఎంత పెద్ద జంతువైనా సరే మాటాష్ చేసేస్తుంది. అయితే నీటిలో ఉండగానే మరో జీవిని వెటాడాలనుకున్న మొసలికి ఊహించని షాక్ తగలింది. వాస్తవం చెప్పాలంటే.. దాని జీవితమే ఎండ్ అయిపోయింది.
వైరల్ అవుతున్న వీడియోలో… మొసలి వేటాడేందుకు ఒడ్డుకు రావడం మీరు చూడవచ్చు. అక్కడే ఉన్న చేపను అది వేటాడాలనుకుంటుంది. అదును చూసి నోట కరుస్తుంది. అయితే అది సాధారాణ చేప కాదు. ఎలక్ట్రిక్ ఈల్. నీటిలో ఉండే అత్యంత ప్రాణాంతక జీవి ఇది. ఎలక్ట్రిక్ ఈల్స్ విద్యుత్తును ఉత్పత్తి చేసే మూడు జతల ఉదర అవయవాలను కలిగి ఉంటాయి. ఏవైనా జీవులు అటాక్ చేయగానే.. అవి భారీగా కరెంట్ విడుదల చేస్తాయి. ఇతర జీవులు వేటాడినప్పుడు.. ఇవి ఆత్మరక్షణ కోసం దాదాపు 860 వోల్ట్‌ల విద్యుత్ విడుదల చేయగలవు. ఈ క్రమంలోనే ఈల్‌ని వేటాడాలనుకున్న మొసలి విద్యుత్ షాక్ కారణంగా గిలగిల కొట్టుకుని ప్రాణాలు విడిచింది. ఈల్ కూడా మొసలి బలమైన పళ్లతో కొరకడంతో ప్రాణాలు విడిచింది. ఆ షాకింగ్ వీడియోను మీరు కూడా చూడండి.
The alligator takes a fish called eel in its jaws. The eel generates 860 volts of electricity. As a result, the crocodile dies of shock without opening the jaws and the eel also dies after being trapped in the jaws.
Such videos are rarely seen.#TwitterNatureCommunity #wild pic.twitter.com/jhT5q5OyRn
— Zubin Ashara (@zubinashara) December 18, 2021
Also Read: Byreddy Siddharth Reddy: బైరెడ్డా.. మజాకా.. సీఎంకు బర్త్ డే విషెస్ ఎలా చెప్పాడో చూడండి