- Telugu News Photo Gallery Millipedes News Interesting Facts About Millipedes Who has 1306 Feet Long Australia
Millipedes: ప్రపంచంలోనే అరుదైన జీవి.. దీని పొడవెంతో తెలిస్తే హడలిపోవడం ఖాయం..!
ఈ భూ ప్రపంచంలో మనుషులతో పాటు కోట్లాది జీవాలు మనుగడ సాగిస్తున్నాయి. భూమిపైనే కాదు.. భూమి లోపలా, నీటిలోనూ ఎన్నీ జీవులు జీవిస్తున్నాయి. అయితే, వీటిలో చాలామటుకు వెలుగులోకి రాలేదు. కొన్ని జీవజాతులు మాత్రమే మనకు తెలుసు.
Updated on: Dec 19, 2021 | 9:01 PM

Millipedes: ఈ భూ ప్రపంచంలో మనుషులతో పాటు కోట్లాది జీవాలు మనుగడ సాగిస్తున్నాయి. భూమిపైనే కాదు.. భూమి లోపలా, నీటిలోనూ ఎన్నీ జీవులు జీవిస్తున్నాయి. అయితే, వీటిలో చాలామటుకు వెలుగులోకి రాలేదు. కొన్ని జీవజాతులు మాత్రమే మనకు తెలుసు. తెలియని జీవులు మరెన్నో ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఓ జీవికి సంబంధించిన వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. అది ఏకంగా 1,306 అడుగుల పొడవుతో భూమి లోపల నివిస్తుంది.

దీని పేరు మిల్లిపెడెస్. ఈ జీవిని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ జీవి చాలా అరుదైనది. ఎందుకంటే ఈ మిల్లిపేడ్‌కు వేల కాళ్లు ఉంటాయి. ఇంత పొడవైన జీవిని చూసి శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు.

ఈ జీవిలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దానికి కళ్ళు లేవు. పొడవాటి దారం లాంటి ఈ జీవి తల ఐస్ క్రీమ్ కోన్ లాగా ఉంటుంది. దానిపై చాలా కొమ్ములు ఉన్నాయి. ఈ కొమ్ములు చీకట్లో కదలడానికి సహాయపడుతాయి. ఇది ఈ ఫంగస్‌ని తింటుంది.

ఈ మిల్లిపేడ్ ఆస్ట్రేలియాలోని ఖనిజాలు ఉన్న గనుల్లో కనుగొన్నారు. ఇక్కడ నిరంతరం మైనింగ్ సాగుతుంటుంది. ఈ క్రమంలో మైనింగ్ చేస్తుండగా.. శాస్త్రవేత్తలు ఆడ, మగ మిల్లిపెడ్‌లను కనుగొన్నారు. ఆడ మిల్లిపెడెస్‌కు 1306 కాళ్లు, మగవారికి 998 కాళ్లు ఉండటాన్ని వారు గమనించారు.

ఈ జీవులు భూమి నుండి 200 అడుగుల లోతులో నివసిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. వాటి కాళ్లను లెక్కించడం అంత సులభం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జీవి ఒక రౌండ్ అటౌట్‌లా చుట్టు చుట్టుకుంటుంది. శాస్త్రవేత్తలు మైక్రోస్కోప్ సహాయంతో ఈ జీవిపై పరిశోధనలు చేసి వాటి చిత్రాన్ని విడుదల చేశారు.
