Bigg Boss 5 Telugu Winner: సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సన్నీ.. ఏమన్నాడంటే..

బిగ్‏బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్ని నిలిచాడు. మొదటి నుంచి కోపం ఎక్కువ అంటూ చివరి వరకు నెగిటివిటిని మోస్తూ వచ్చిన

Bigg Boss 5 Telugu Winner: సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సన్నీ.. ఏమన్నాడంటే..
Vj Sunny
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 20, 2021 | 2:22 PM

బిగ్‏బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్ని నిలిచాడు. మొదటి నుంచి కోపం ఎక్కువ అంటూ చివరి వరకు నెగిటివిటిని మోస్తూ వచ్చిన సన్నీ చివరకు తెలుగు రాష్ట్ర ప్రజల మనసులను దొచుకుని బిగ్‏బాస్ సీజన్ 5 విజేతగా నిలిచారు. ఎంటర్ టైనర్ అనే పేరు సంపాందించుకున్న సన్నీ.. మచ్చా మచ్చా అంటూనే యూత్‏ను ఆకట్టుకున్నాడు. మొత్తానికి ఖమ్మం కుర్రాడు బిగ్‏బాస్ సీజన్ 5 ట్రోఫీ అందుకున్నాడు. గెలిచిన తర్వాత సన్నీ స్జేజ్ పై ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

సన్నీ మాట్లాడుతూ.. సారి ఇక్కడ మాట్లాడినా నామినేషన్లో మాట్లాడినట్లే ఉంది సార్.. అంటూ కామెడీ చేశాడు. అనంతరం తనను గెలిపించినందుకు 19 మంది కంటెస్టెంట్స్‏కు.. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు సన్నీ. ఏ సీజన్‏లో లేనిది ఈ సీజన్ లో ప్రామిస్ చేసుకున్నాం.. ఎంత కొట్టుకున్నా.. మరునాడే కలిసిపోయాం.. నాగ్ సార్ ఐ లవ్యూ సార్ అంటూ తన సంతోషాన్ని తెలియజేశాడు. దీంతో తిరిగి నాగార్జున ఐలవ్యూ అనగానే సిరికి చెప్పండి సర్ అనగానే సిరికి ఐ లవ్యూ అని చెప్పేసాడు.

ఈ స్థాయిలో నిలబడటానికి ప్రేక్షకులు.. స్నేహితులు.. ప్రతిక్షణం నాగార్జున సార్ మోటివేషన్ కారణమని.. కప్పు ముఖ్యం బిగులూ అనేలా చేసింది మా కళావతి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత షణ్ముఖ్ గురించి ఒక క్లారిటీ ఇస్తాను సార్.. ఈ స్టేజ్ మీదే మాట్లాడాలి ఇది అంటూ షణ్ముఖ్, సిరి రిలేషన్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. షణ్ముఖ్ అండ్ సిరి. అలాంటి మంచి ఫ్రెండ్ దొరకడం అదృష్టం.. నాకు మానస్‏కి ఎలాంటి స్నేహమైతే ఉందో అదే స్నేహం వాళ్లిద్దరి మధ్య ఉంది అని చెప్పుకొచ్చాడు. దాంతో షణ్ముఖ్.. సన్నీకి హగ్ ఇచ్చాడు..

Also Read: Bigg Boss 5 Telugu Winner and Updates: అంబరాన్ని అంటుతున్న సంబరాలు.. రచ్చ రచ్చ చేస్తున్న సన్నీ ఫ్యాన్స్‌..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ టైటిల్‌ ఎగిరేసుకు పోయిన సన్నీ.. ఇంకా ఏమేం గెలుచుకున్నాడో తెలుసా.? అక్షరాల..

Bigg Boss 5 Telugu Winner: సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సన్నీ.. ఏమన్నాడంటే..

Bigg Boss 5 Telugu Winner: విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన రోల్ రైడా.. అందరూ షాక్..