Jabardast: జబర్దస్త్‌కు షాక్‌.. మరో ఇద్దరు టీమ్‌ లీడర్లు గుడ్‌బై..!

Jabardast: జబర్దస్త్‌.. ఈ పేరు తెలుగు టీవీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. జబర్దస్త్‌ షోతో ఎంతో మంది పాపులర్‌ అయ్యారు. 2013లో ప్రారంభమైన ఈ..

Jabardast: జబర్దస్త్‌కు షాక్‌.. మరో ఇద్దరు టీమ్‌ లీడర్లు గుడ్‌బై..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 19, 2021 | 9:37 PM

Jabardast: జబర్దస్త్‌.. ఈ పేరు తెలుగు టీవీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. జబర్దస్త్‌ షోతో ఎంతో మంది పాపులర్‌ అయ్యారు. 2013లో ప్రారంభమైన ఈ జబర్దస్త్‌ షో.. ఇప్పటికే ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఎంతో మంది కమెడియన్స్‌, జడ్జీలు వచ్చి వెళ్లారు. కానీ షో మాత్రం ఆగిపోకుండా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ కీలక అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పటికే పలువురు టీమ్‌ లీడర్లు, ఇతర కమెడియన్స్‌ షోను విడిచి వెళ్లగా, తాజాగా మరో ఇద్దరు గుడ్‌బై చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. అదిరే అభి జబర్దస్త్‌ షో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే మా టీవీలో నాగబాబు, శ్రీదేవి జడ్జిలుగా ఉన్న కామెడీ స్టార్స్‌ ప్రోగ్రామ్‌కు వెళ్లిపోయారు. అతడితో పాటు మరో టీమ్‌ లీడర్‌గా పని చేసిన జిగేల్‌ జీవన్‌ కూడా జబర్దస్త్‌ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే కామెడీ స్టార్స్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఫోటోను అదిరే అభి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో వీరిద్దరు జబర్దస్త్‌ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీరు జబర్దస్త్‌ను వీడుతున్నట్లు ప్రకటించనప్పటికీ.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫోటోను చూస్తే వీరు జబర్దస్త్‌ వీడినట్లు తెలుస్తోంది.

అయితే ఇటీవల జబర్దస్త్ ను వీడుతున్న కామెడీయన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా ఇద్దరు టీం లీడర్లు ఏకంగా జబర్దస్త్‌ను వీడటం చర్చనీయాంశంగా మారింది. ఈ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అదిరే అభి, జిగేల్ జీవన్ తాజాగా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పడం షాక్‌కు గురి చేస్తోంది. కాగా, వీరిద్దరు కలిసి కామెడీ స్టార్స్‌లో ఓ స్కిట్‌ను అదిరే అభి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Abhi

ఇవి కూడా చదవండి:

Lakshmi Manchu: నెట్టింట వైరల్ అవుతున్న యాక్సిడెంట్ పిక్స్‌.. క్లారిటీ ఇచ్చిన మంచు లక్ష్మి.. అసలేమైందంటే..?

Avika Gor: అందంతో కట్టిపడేస్తున్న అవికా లేటెస్ట్ ఫోటోస్