Bigg Boss 5 Telugu Winner: విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన రోల్ రైడా.. అందరూ షాక్..

బిగ్ బాస్ నిర్వాహకులు ఎంత పక్కాగా వ్యవహరించినా సరే.. ప్రతి సీజన్‌లో వారికి గట్టి షాక్ తగులుతూనే ఉంది. లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి.

Bigg Boss 5 Telugu Winner: విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన రోల్ రైడా.. అందరూ షాక్..
Rool Rida
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 19, 2021 | 9:26 PM

బిగ్ బాస్ నిర్వాహకులు ఎంత పక్కాగా వ్యవహరించినా సరే.. ప్రతి సీజన్‌లో వారికి గట్టి షాక్ తగులుతూనే ఉంది. లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ ముగిసిన వెంటనే.. విన్నర్ వీజే సన్నీ అని అందరికీ తెలిసిపోయింది. అయితే ఇదంతా లీకు వీరులు ఇచ్చే ఇన్ఫర్మేషన్. కానీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రోల్ రైడా మాత్రం.. విన్నర్ ఎవరో తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో ప్రకటించేశాడు. ఇంతలా ఉర్రూతలూగించే ప్రోమోస్, కోట్లలో ఖర్చు, ఎందరో గెస్టులు.. అన్నింటికి మించిన ఎంటర్టైన్‌మెంట్, ఎగ్జైట్‌మెంట్, సస్పెన్స్.. ఓ రేంజ్‌లో నిర్వాహకులు ఫినాలే ప్లాన్ చేసుకుంటే.. రోల్ రైడా మాత్రం పెద్ద ఝలకే ఇచ్చాడు. సన్నీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ అని అధికారికంగా ప్రకటించి.. అభినందనలు తెలిపాడు. అతడు కాదేమో.. చివరకు ఎదురు చూద్దాం అనుకుంటున్నవారికి కూడా రోల్ రైడా ఫేస్ బుక్ పోస్ట్‌తో పిచ్చ క్లారిటీ వచ్చేసింది. అతడి పోస్ట్‌పై భిన్న స్పందనలు వస్తున్నాయి. బిగ్ బాస్ ప్రకటించక ముందే ఎందుకు? అంటూ కొందరు నెటిజన్లు ఫైర్ అవుతుండగా.. సన్నీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

Also Read: Bigg Boss 5 Telugu Grand Finale Live: గ్రాండ్‌గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్.. స్టేజ్ పై సందడే.. సందడే

 ఎలక్ట్రిక్ ఈల్‌ను వేటాడాలనుకున్న మొసలి.. షాకింగ్.. ఊహించని విషాదాంతం..

బైరెడ్డా.. మజాకా.. సీఎంకు బర్త్ డే విషెస్ ఎలా చెప్పాడో చూడండి