Bigg Boss 5 Telugu: సన్నీ విన్నర్‌గా నిలవడంపై తల్లి కళావతి హర్షం.. స్నేహానికి విలువ ఇస్తాడంటూ..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ ఐదు ఘనంగా ముగిసింది.  ఈ సీజన్ ఐదులో విజేతగా బుల్లి తెర నటుడు సన్నీ నిలిచాడు.  మొదట్లో తలబడినా.. ఆసాంతం నిలిచి.. తనదైన శైలిలో..

Bigg Boss 5 Telugu: సన్నీ విన్నర్‌గా నిలవడంపై తల్లి కళావతి హర్షం.. స్నేహానికి విలువ ఇస్తాడంటూ..
Sunny And His Mother
Follow us
Surya Kala

|

Updated on: Dec 20, 2021 | 7:50 AM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ ఐదు ఘనంగా ముగిసింది.  ఈ సీజన్ ఐదులో విజేతగా బుల్లి తెర నటుడు సన్నీ నిలిచాడు.  మొదట్లో తలబడినా.. ఆసాంతం నిలిచి.. తనదైన శైలిలో ప్రతిభకనబరుస్తూ ఆసాంతం ఆకట్టుకున్నాడు. వంద రోజులకుపైగా జరిగిన షోలో విక్టరీ సొంతం చేసుకుని విన్నర్ గా నిలిచాడు సన్నీ.. తన తనయుడు విజయంపై సన్నీ తల్లి కళావతి హర్షం వ్యక్తం చేశారు. తన కొడుకు బిగ్ బాస్ షోలో తను గెలుస్తాడని తాను అనుకున్నట్లు చెప్పారు.  చివరికి తన కల నిజమైందన్నారు. అంతేకాదు సన్నీ చిన్నతనం నుంచి చాలా చురుగ్గా ఉండేవాడని..కష్టపడి పనిచేసే తత్వం తన కొడుకు సొంతం అన్నారు. నటుడిగా సీరియల్ లో తనను తాను నిరూపించుకున్నాడని చెప్పారు. అయితే నటుడుగా బుల్లి తెరమీద అడుగు పెట్టకముందు.. సున్నీ రిపోర్టర్‌గా పనిచేశాడని గుర్తు చేసుకున్నారు కళావతి.

బిగ్ బాస్ సీజన్ ఐదులో విన్నర్ గా నిలిచి హీరో నాగార్జున చేతుల మీదుగా సన్నీ కప్పు అందుకుంటున్న సమయంలో తాను తల్లిగా ఎమోషనల్ గా ఫీల్ అయినట్లు తెలిపారు. కప్పు తీసుకునే సమయంలో తనను వేదికపైకి ఆహ్వానించినప్పుడు  చాలా సంతోషంగా అనిపించిందన్నారు కళావతి.

సన్నీ ఈ సీజన్ లో విజేత గా నిలిచి  రెమ్యునరేషన్‌తో పాటు టైటిల్‌ విన్నర్ ప్రైజ్ మనీ . 50 లక్షల సహా ఇతర బహుమతులను కలుపుకుని కోటికిపైగానే అందుకున్నాడని తెలుస్తోంది.

Also Read:    నేడు దేశవ్యాప్తంగా సుపరిపాలన వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్రం..