Good Governance Week: నేడు దేశవ్యాప్తంగా సుపరిపాలన వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్రం..

Good Governance Week : నేటి నుంచి దేశవ్యాప్తంగా 'సుపరిపాలన వారోత్సవాలు' కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.  ఈ కార్యక్రమంలో లక్షలాది ఫిర్యాదులను పరిష్కరించనుంది. దివంగత నేత మాజీ ప్రధాని..

Good Governance Week: నేడు దేశవ్యాప్తంగా సుపరిపాలన వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్రం..
Good Governance Week
Follow us

|

Updated on: Dec 20, 2021 | 7:23 AM

Good Governance Week : నేటి నుంచి దేశవ్యాప్తంగా ‘సుపరిపాలన వారోత్సవాలు’ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.  ఈ కార్యక్రమంలో లక్షలాది ఫిర్యాదులను పరిష్కరించనుంది. దివంగత నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా డిసెంబర్ 25ని ‘సుపరిపాలన దినోత్సవం’గా జరుపుకుంటారు. వివరాల్లోకి వెళ్తే..

‘గుడ్ గవర్నెన్స్ వీక్’లో భాగంగా ప్రజల ఫిర్యాదులను పరిష్కరించేందుకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా సుపరిపాలన వారోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం డిసెంబరు 20-25 వరకు నిర్వహించడానికి సన్నాహాలు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ‘సుపరిపాలన వారం’ సందర్భంగా సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాల నిర్వహణకు ప్లాన్ చేసింది.

పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (DARPG) గుడ్ గవర్నెన్స్ సిస్టమ్స్‌పై ప్రదర్శనను ప్రారంభించడమే కాకుండా.. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి మరియు సేవలను మెరుగుపరచడానికి ‘సుపరిపాలన దినోత్సవం” పేరుతో దేశవ్యాప్త ప్రచారాన్ని సోమవారం ప్రారంభించనున్నట్లు తెలిపింది. సోమవారం జరిగే ‘గుడ్‌ గవర్నెన్స్‌ వీక్‌’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుడ్ గవర్నెన్స్ వీక్ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. గత రెండేళ్లుగా DARPG సాధించిన విజయాలపై బుక్‌లెట్‌ను విడుదల చేస్తారు.

‘సుపరిపాలన వారం’ సందర్భంగా కేంద్రం చేపట్టిన వివిధ సుపరిపాలన కార్యక్రమాలను గురించి తెలియజేసేలా అనేక  కార్యక్రమాలను ప్లాన్ చేశారు. సుపరిపాలనను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లడమే ఈ ప్రచారంలో ప్రధానాంశం. వాజ్ పేయి జయంతి డిసెంబరు 25న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే ‘గుడ్ గవర్నెన్స్ డే’ వేడుకతో ‘గుడ్ గవర్నెన్స్ వీక్’ ముగుస్తుందని డీఏఆర్‌పీజీ తెలిపింది.

ఇదే విషయంపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. ప్రజలకు సుపరిపాలనను అందించడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అంతేకాదు ప్రజలు పాలనలో చురుకైన పాత్ర పోషించేలా మార్గనిర్దేశం చేస్తామని తెలిపారు.

Also Read:  ఈరోజు ఈరాశివారు కొత్త వస్తువులు కొనే ఆలోచన చేస్తారు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..