Horoscope Today: ఈరోజు ఈరాశివారు కొత్త వస్తువులు కొనే ఆలోచన చేస్తారు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (20-12-2021):  కొత్తపనులు ప్రారంభించాలన్నా.. ప్రయాణం చేయాలన్నా శుభకార్యాల విషయంలోనూ ఇలా అనేక విషయాలపై మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల..

Horoscope Today: ఈరోజు ఈరాశివారు కొత్త వస్తువులు కొనే ఆలోచన చేస్తారు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Surya Kala

|

Updated on: Dec 20, 2021 | 6:59 AM

Horoscope Today (20-12-2021):  కొత్తపనులు ప్రారంభించాలన్నా.. ప్రయాణం చేయాలన్నా శుభకార్యాల విషయంలోనూ ఇలా అనేక విషయాలపై మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 20వ తేదీ ) సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్య బాధలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు రుణబాధలు తీరిపోయి సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది.  నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి వాయిదా వేసుకుంటారు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. మానసికంగా ఆందోళన పొందుతారు.  ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను సమయస్ఫూర్తితో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. బంధుమిత్రులతో కలిసి విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు  కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పిల్లలతో సంతోషంగా ఉంటారు. కొత్తపనులను చేపడతారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. బంధు మిత్రులను కలుస్తారు. క్రీడా, రాజకీయ రంగాల్లోని వారు తగిన గుర్తింపు పొందుతారు. స్త్రీలకు సంతోషంగా గడుస్తుంది. ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ఇతరుల విమర్శలకు గురవుతారు. ఆకస్మిక ధన వ్యయం కలుగుతూఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ఋణప్రయత్నాలు చేస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు.  గృహంలో మార్పును కోరుకుంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి స్త్రీలకు సంతోషంగా గడుస్తుంది. ప్రయాణాలను అధికంగా చేయడం వలన అధిక వ్యయం ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అనారోగ్యానికి గురవుతారు. ఔషధాల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు కొత్త పనులను చేపడతారు. ఆకస్మిక ధన వ్యయం కలుగుతుంది. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. మానసిక ఆనందాన్ని పొందుతారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తపనులను వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. స్వల్ప అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ప్రయాణాలు అధికంగా చేస్తారు.

మీన రాశి:  ఈరోజు ఈరాశివారు స్థిరాస్తికి సంబందించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా   స్థానచలనం ఉంటుంది.

Also Read:

తిరుప్పావై ఐదో పాశురం.. పాపాలు తొలగుటకు కృష్ణుడికి 8పుష్పాలను అర్పించమంటున్న గోదాదేవి

యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం