Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు.. వారు చేపట్టే పనులలో పురోగతి లభిస్తుంది..

Weekly Horoscope: ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం...

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు.. వారు చేపట్టే పనులలో పురోగతి లభిస్తుంది..
Horoscope
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 19, 2021 | 12:45 PM

Weekly Horoscope: ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు…

మేష రాశి

ఈ రాశి వారికి ఈ వారం అదృష్టయోగముంది. ఆశించింది దక్కుతుంది. ఉద్యోగంలో మనసు పెట్టి పనిచేయండి. త్వరగా లక్ష్యాన్ని చేరతారు. పొదుపు అవసరం. ఆశయ సాధనలో క్రమంగా పైకి వస్తారు. నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండాలి. మిత్రుల సహకారం లభిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది. ఆర్థికంగా మీకు బలాన్ని చేకూరుస్తుంది. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఆఫీసుకు వెళ్లే సమయంలో పరిచయస్తులను కలవొచ్చు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది.

వృషభ రాశి

ఈ రాశి వారు ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి , వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం. తెలియని ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా శ్రమించాలి. ధర్మం తప్పవద్దు. ఇంట్లోవారి సూచనలు అవసరం. సహనం రక్షిస్తుంది. దూషించిన వారే కీర్తిస్తారు. మంచి పేరు వస్తుంది. ముఖ్యకార్యాలను వాయిదా వేస్తే నష్టాన్ని నివారించవచ్చు. నవగ్రహ శ్లోకాలు చదివితే మనశ్శాంతి లభిస్తుంది. విద్యార్థులకు ఆహ్లాదకరంగా, అన్నింటా అనుకూలంగా ఉంటుంది.

మిథున రాశి

ఈ రాశి వారికి ఈ వారం అభీష్టసిద్ధి ఉంది. ఉద్యోగంలో ఆశించిన ఫలితం లభిస్తుంది. ఆలోచనలకు కార్యరూపాన్నిస్తారు. ఇప్పుడు వేసే ప్రణాళికలు బంగారు భవిష్యత్తునిస్తాయి. ఆర్థిక విజయం ఉంది. వ్యాపారంలో విస్తరించేందుకు పరిస్థితులు సహకరిస్తాయి. ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. లక్ష్మీధ్యానం శుభాన్నిస్తుంది. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు. మీరు వారి ఆరోగ్యం కోసం డబ్బు కూడా ఖర్చు చేయవలసి రావచ్చు.

కర్కాటక రాశి

ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉన్నతమైన ఆశయాలతో పనిచేయాలి. ఫలితం సంతృప్తినిస్తుంది. ఆత్మీయుల సలహా పనిచేస్తుంది. అవమానించే వారున్నారు. మిత సంభాషణ మేలుచేస్తుంది. మీ ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. ఆంజనేయస్వామిని స్మరించండి, ఆశయం నెరవేరుతుంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మంచినిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు పొందుతారు.

సింహ రాశి

కాలం అనుకూలం. ఆగిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. ఆత్మసంతృప్తినిచ్చే పనులు చేయండి. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరవద్దు. ఇష్టదేవతను స్మరిస్తే మేలు. మీ మాటల వల్ల ప్రజలు ప్రభావితం కావచ్చు. ఆర్థిక విషయాలలో ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. స్వల్ప మరియు మధ్య దూర ప్రయాణాలు సాధ్యమే. ఏ పని ప్రారంభించినా న్యాయం జరుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

కన్య రాశి

ఈ రాశి వారు ఈ వారం అదృష్టవంతులవుతారు. ఇబ్బందుల నుండి బయటపడతారు. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలం. ధైర్యంగా నిర్ణయం తీసుకుని అమలుచేయండి. సాహస కార్యాలు విజయాన్నిస్తాయి. ఆటంకాలు తొలగుతాయి. వారం మధ్యలో శుభం జరుగుతుంది. ఆర్థికస్థితి అనుకూలం. లక్ష్మీనారాయణ స్మరణ ఆనందాన్నిస్తుంది. మీరు గురువుల సహకారం పొందుతారు. అనేక సమస్యలకు ఈరోజు పరిష్కారాలు లభిస్తాయి.

తుల రాశి

మిశ్రమకాలం నడుస్తోంది. ఉద్యోగం అనుకూలం. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. అనుకున్నది సాధిస్తారు. తగిన గుర్తింపూ గౌరవాలు లభిస్తాయి. ధనధాన్య లాభాలుంటాయి. ఆగిన పనులను పూర్తి చేయండి. ఉత్సాహం తగ్గకూడదు. అపార్థాలకు అవకాశమివ్వవద్దు. స్పష్టంగా సమాధానాలివ్వాలి. దుర్గాదేవిని ఆరాధించండి, ప్రశాంతత లభిస్తుంది. మీ కార్యాలయంలో ఒక వ్యక్తి నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు పూర్తి చేస్తారు.

వృశ్చికం రాశి

ఈ రాశి వారు ఈ వారం ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించండి. చంచలత్వం పనికిరాదు. సొంత నిర్ణయాలు విజయాన్నిస్తాయి. గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. అనవసరమైన ఆలోచనలను మనసులోకి రానీయవద్దు. కుటుంబసభ్యుల సూచనలతో మేలు జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. వ్యాపారం నుండి ప్రయోజనం పొందవచ్చు.

ధనుస్సురాశి

ఈ రాశి వారు మనోబలం అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ తప్పదు. మిత్రుల ద్వారా ఒక పని అవుతుంది. తెలియని అవరోధాలు ఉన్నాయి. ప్రతి అడుగూ ఆచి తూచి వేయాలి. ఎదురుచూస్తున్న పనిలో పురోగతి ఉంటుంది. గృహయోగం ఉంది. సుఖసంతోషాలు ఉన్నాయి. ఆశయం నెరవేరే దిశగా అడుగులు వేస్తారు. శివారాధనతో మనశ్శాంతి లభిస్తుంది. ఉద్యోగ వృత్తితో సంబంధం ఉన్న వ్యక్తులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి

శుభయోగముంది. కర్తవ్యాలను సకాలంలో నిర్వర్తించండి. ఉద్యోగం బాగుంటుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. మంచి భవిష్యత్తు సూచితం. ఇబ్బందులు తొలగుతాయి. ఆత్మవిశ్వాసం సడలకూడదు. వ్యాపారస్థితి మిశ్రమం. లక్ష్యంపై దృష్టి నిలపాలి. వ్యయభారం లేకుండా చూసుకోవాలి. కుటుంబపరమైన అభివృద్ధి ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది.

కుంభ రాశి

వ్యాపారం బాగుంటుంది. పనులను వాయిదా వేయకుండా పూర్తిచేయండి. తగినంత గుర్తింపు లభిస్తుంది. క్రమంగా అవరోధాలు తొలగుతాయి. స్వల్ప ధనలాభం. వారం మధ్యలో ఒక మంచి వార్త వింటారు. ఆవేశపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి. లలితా సహస్రనామం పఠించండి, మనోబలం పెరుగుతుంది. కుంభ రాశికి చెందిన కొందరు వ్యక్తులు కుటుంబ సభ్యులతో వివాహ లేదా పార్టీలో పాల్గొనవచ్చు.

మీన రాశి

ఈ రాశి వారికి ఈ వారం మంచి జీవితం లభిస్తుంది. అభీష్టసిద్ధి ఉంది. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. అధికార లాభముంటుంది. ఉద్యోగాభివృద్ధి సూచితం. అపార్థాలకు తావివ్వవద్దు. వ్యాపారలాభం స్వల్పం. మిత్రుల సలహాలు అవసరమవుతాయి. పట్టుదలతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. నిబద్ధత గొప్పవారిని చేస్తుంది. నచ్చిన దైవాన్ని స్మరించండి, శుభం జరుగుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.