Variety Festival: తమిళనాడులో వెరైటీ ఫెస్టివల్.. ఆ మట్టి కోసం ఎగబడ్డ గ్రామస్తులు.. ఆసక్తికర విశేషాలు మీకోసం..
Variety Festival: తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్ సమీపంలో ఉన్న కరుణ గవెల్ అయ్యన్నార్ స్వామి ఆలయం లో కల్లర్ వెట్టు ఉత్సావాలు ప్రతి ఏటా నిర్వహిస్తారు.

Variety Festival: తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్ సమీపంలో ఉన్న కరుణ గవెల్ అయ్యన్నార్ స్వామి ఆలయంలో కల్లర్ వెట్టు ఉత్సావాలు ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఇందుకోసం చుట్టుపక్కల నుండి జనం వేలాదిగా తరలివస్తారు. ఈ ఉత్సావాలలో భాగంగా అయ్యన్నార్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ సమీపంలో ఉన్న భూమిలో ఒక కొబ్బరి బోండాన్ని ఉంచి పూజలు చేస్తారు, మరుసటి రోజు పూజారి ఒంటిమీదకి అయ్యన్నార్ స్వామి రావడంతో ఆవేశంగా ఆ కొబ్బరిబొండాన్ని రెండు ముక్కలుగా నరుకుతారు. ఆ కొబర్రి నీళ్లు తడిసిన మట్టి కోసం జనం ఎగబడతారు. తడిసిన మట్టిని తమ ఇంటికి తీసుకెళ్లి దేవుడు ముందు పెట్టి పూజిస్తారు, ఆలా చేస్తే తమ కష్టాలు అన్ని తీరుతాయని వారి నమ్మకం. అయితే, కొబ్బరి నీళ్లతో తడిసిన మట్టికోసం అక్కడి జనాలు భారీగా ఎగబడ్డారు. పెద్దలు, చిన్నారులు, మహిళలు, ఆఖరికి ఉత్సవాలలో భద్రతకు వచ్చిన పోలీసులు సైతం మట్టికోసం ఎగబడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలాఉంటే.. గత సంవత్సరం కరోనా కారణంగా ఈ ఉత్సవాలను నిర్వహించలేదు. ఈ సంవత్సరం ఉత్సావాలను నిర్వహించేందుకు అధికారులు అనుమతివ్వడంతో.. ఆలయ సిబ్బంది ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
Also read:
Income Tax Password: ఆదాయపు పన్ను పోర్టల్‌లో పాస్‌వర్డ్ మర్చిపోయారా..? ఇలా చేయండి