- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: These plants must be kept in your office for progress and prosperity in telugu
Vastu Tips: మీ ఆఫీస్‌లో లేదా ఇంట్లో ఈ మొక్కలను వాస్తు ప్రకారం పెట్టండి.. సక్సెస్, సంపద మీ సొంతం..
Vastu Tips: ఆఫీస్ దేవాలయంలో సమానం.. ఆఫీస్ ఆదాయ వనరు మాత్రమే కాదు.. సృజనాత్మకత ప్రతిబింబించేలా కనిపిస్తే.. అందులో పనిచేసేవారికి మరింత ఆసక్తి కలుగుతుంది. అందుకనే ఆఫీసుల్లో సంపద, విజయం, శ్రేయస్సును పెంపొందించేలా కొన్ని మొక్కలు ఉంచుకోవచ్చు. ఏ మొక్కలను ఉంచితే ఏ విధమైన లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం..
Updated on: Dec 20, 2021 | 10:13 AM

హిందూ పురాణాల ప్రకారం.. అరటి మొక్క విష్ణువుకి చిహ్నం. అందువలన అరటి మొక్క పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అరటి మొక్కను ఆఫీస్ లో ఉంచడం వలన విష్ణువు ఆశీర్వాదంతో సురక్షితంగా ఉంటుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. పరిసరాలను కూడా స్వచ్ఛంగా ఉంచుతుంది. అరటి మొక్కను తూర్పు ముఖంగా శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి.

లిల్లీ మొక్కలు ఆనందం మరియు స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణించబడతాయి. అందుకే ఇండోర్ మొక్కలుగా ఆఫీస్ లో లిల్లీ మొక్కలను ఉంచుకోవచ్చు. ఈ మొక్కలు ప్రతికూల పరిస్థితులను తగ్గించడంలో సహాయపడతాయి. స్వీయ నియంత్రణను కొనసాగించడంలో సహాయపడతాయి. అందుకే లిల్లీ మొక్కలను బహుమతిగా ఇవ్వవచ్చు.

మనీ ప్లాంట్ మొక్కను ఇల్లు లేదా ఆఫీసు లో ఉంచడం వల్ల అందం మరింత పెరుగుతుంది. అయితే ఈ మనీ ప్లాంట్ ను వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా, ఆఫీస్ లో ఉంచడం వలన మీ జీవితాల్లో శ్రేయస్సు , సంపద లభిస్తుంది. మనీ ప్లాంట్ ను ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతుంది.

స్నేక్ ప్లాంట్ కు వాస్తు శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. సానుకూలత పరిస్థితు ఉండేలా చేస్తుంది. అంతేకాదు స్నేక్ ప్లాంట్ మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. వాతావరణంలోని గాలిని శుద్ధి చేస్తుంది. అందుకనే ఈ మొక్కను మీ ఆఫీసు డెస్క్‌పై ఉంచడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.





























